- Home
- Entertainment
- Amani Comments on Roja: ఆమని సంచలన వ్యాఖ్యలు.. నా మొగుడు నా దగ్గరే.. రోజా మొగుడు రోజా దగ్గరే..
Amani Comments on Roja: ఆమని సంచలన వ్యాఖ్యలు.. నా మొగుడు నా దగ్గరే.. రోజా మొగుడు రోజా దగ్గరే..
టెలివిజన్ సెన్సేషనల్ షో జబర్ధస్త్.. నెక్ట్స్ వీక్ మస్త్ జబర్ధస్త్ గా మారబోతోంది. సెన్సేషనల్ కామెంట్స్ .. షాక్ ల మీద షాక్ లు తగలబోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆమని(Amani) రోజా(Roja) పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

నిన్నటి తరం హీరోయిన్ ఆమనీ(Amani)..రోజా(Roja) ఈ ఇద్దరు స్టార్స్ గా టాలీవుడ్ ను ఏలారు. 90 దశకంతో ఈ ఇద్దరు హీరోయిన్ల సినిమాలు ఓ రేంజ్ లో ఆడేవి. స్టార్ హీరోల సరసన ఆడి పాడిన భామలు ఫెయిడ్ అవుట్ అయ్యాక కూడా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు.
ఆమని అడపాదడపా సినిమాలు చేస్తుండగా..మరో హీరోయిన్ రోజా(Roja) టెలివిజన్ షోలు.. పాలిటిక్స్ తో బిజీ అయిపోయారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ ఆమనీ (Amani).. రోజా పై చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాము కలిసి నటించిన సినిమాను గుర్తు చేస్తూ ఆమనీ ఈ కామెంట్స్ చేశారు.
నా మొగుడు నాదగ్గరే ఉన్నారు..రోజా(Roja) భర్త రోజా దగ్గరే ఉన్నాడు. ఎవరి భర్తలతో వారు హ్యాపీగా ఉన్నామన్నారు ఆమని(Amani). నిజానికి ఈ డైలాగ్స్ తాము జగపతి బాబు(Jagapathi Babu) తో చేసిన శుభలగ్నం సినిమాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధాణంగా ఆమె చెప్పారు.
1994 లో ఆమని, జగపతి బాబు, రోజా(Roja) కలిసి నటించిన సినిమా శుభలగ్నం, ఈ సినిమాలో ఆమని(Amani) డబ్బుకు ఆశపడి తన భర్తను రోజాకు అమ్మేస్తుంది. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ అయ్యింది ఎస్వీ కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈమూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ ముగ్గరు ఇమేజ్ ను అమాంతం పెంచేసింది.
ఇక నెక్ట్స్ వీక్ ఎక్స్టా జబర్ధస్త్ షోలో గెస్ట్ గా ఆమని(Amani) పాల్గొన బోతున్నారు. దానికి సబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈప్రోమోలో తాము నటించిన శుభలగ్నం సినిమాకు సంబంధించిన ప్రశ్న రావడంతో..ఈ సినిమాకు చెందిన సందర్భం ప్రకారం ఆమని ఆ కామెంట్స్ చేశారు.
సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న జబర్ధస్త్ షో.. సెన్సేషనల్ కామెంట్స్ కు కూడా వేదిక అవుతుంది. అదరిపోయే పంచులు.. కడుబుబ్బా నవ్వించే జోకులతో పాటు.. ఇలా సెలబ్రెటీలు నోరుజారి అన్న మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.