ఘనంగా అమలాపాల్ సీమంతం వేడుక.. ట్రెడిషనల్ లుక్ లో చూడముచ్చటగా దంపతులు
డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.
డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. అమలాపాల్ సినిమాల్లో సైతం గ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.
గత ఏడాది అమలాపాల్.. జగత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండు నెలలకే అమలాపాల్ తన ప్రెగ్నన్సీ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తాజాగా అమలాపాల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. సీమంతం ఫోటోలని అమలాపాల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో అమలాపాల్ ఎంతో అందంగా మెరిసిపోతోంది. దంపతులిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.
అమలాపాల్ సీమంతం వేడుక జరగడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతకు ముందు అమలాపాల్ బేబీ బంప్ తో మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం ఫోటో షూట్ చేసింది.
ఇదిలా ఉండగా అమలాపాల్ భర్త జగత్ గోవా కి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. లగ్జరీ విల్లాలో అతడు మేనేజర్ గా పనిచేస్తున్నాడట. అమలాపాల్ కి అతడికి పరిచయం కావడం అది ప్రేమగా మారడం.. పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.