బాత్ టవల్ చుట్టుకుని ప్రియుడితో ప్రైవేట్ గా అమలాపాల్.. ప్రీ వెడ్డింగ్ సీజన్ షురూ..
తాజాగా అమలాపాల్ జగత్ తో సన్నిహితంగా ఉన్న మరో పిక్ ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ని బట్టి చూస్తే అమలాపాల్, జగత్ పెళ్లి కార్యక్రమాలు షూరూ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.
డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. దీనితో అమలాపాల్ వెండి తెరపై కూడా బోల్డ్ గా నటించింది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.
Amala Paul
అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.
అయితే అమలాపాల్ రెండో పెళ్లి విషయంలో చాలా రూమర్లు వచ్చాయి. అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది అంటూ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇటీవల అమలాపాల్ తన బర్త్ డే సందర్భంగా ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. అతడినే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అమలాపాల్ కి కాబోయే భర్త పేరు జగత్ దేశాయ్. రీసెంట్ గానే వీరిద్దరూ డేటింగ్ మొదలు పెట్టారట.
అమలాపాల్ బర్త్ డే సందర్భంగా జగత్ ఆమెకి కాస్ట్లీ రింగ్ ఇచ్చి పెళ్లి ప్రపోజ్ చేశాడు. పెళ్ళికి అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అమలాపాల్ జగత్ తో సన్నిహితంగా ఉన్న మరో పిక్ ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ని బట్టి చూస్తే అమలాపాల్, జగత్ పెళ్లి కార్యక్రమాలు షూరూ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.
అమలాపాల్, జగత్ ఇద్దరూ బాత్ టవల్స్ చుట్టుకుని రొమాంటిక్ గా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. ఈ ఫోటోకి అమలాపాల్ ప్రీ వెడ్డింగ్ సీజన్ షురూ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే పెళ్లి పనులు మొదలైనట్లే గా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జగత్ గోవా కి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. లగ్జరీ విల్లాలో అతడు మేనేజర్ గా పనిచేస్తున్నాడట. అమలాపాల్ కి అతడికి పరిచయం కావడం అది ప్రేమగా మారడం చకచకా జరిగిపోయాయి.