విరజిమ్మే కాంతులు, గ్రాండ్ ఏర్పాట్ల మధ్య అమలాపాల్ పెళ్లి.. ఈ ఫొటోలు చూశారా?
మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ రెండో పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తన భర్తతో పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
మలయాళీ హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) గత నెల అక్టోబర్ 26న తన ప్రియుడు ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయి (Jagat Desai) ని పరిచయం చేసింది. అప్పుడు పంచుకున్న వీడియోలో రింగులు మార్చుకున్నారు.
అలా ఎంగేజ్ మెంట్ అయ్యిందో లేదో.. ఇలా పెళ్లి కార్యక్రమాన్ని కూడా ముగించేసింది. ఎవరూ ఊహించలేకుండా ఇంత త్వరగా రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ఇప్పటికే తమ మ్యారేజ్ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తాజాగా తమ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలియజేసేలా కొన్ని ఫొటోలను పంచుకుంది. కాంతులు విరజిమ్మే అరెంజ్ మెంట్స్ మధ్య చాలా ఘనంగా అమలాపాల్ - జగత్ దేశాయి పెళ్లి జరిగిందని అర్థమవుతోంది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని అర్థమవుతోంది. ఇక వీరి వివాహానికి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరైనట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు ఇంకా రావాల్సి ఉంది. కేవలం నూతన వధూవరులు ఇచ్చే అప్డేట్స్ తోనే పెళ్లికి సంబంధించిన విషయాలు తెలుస్తుండటం విశేషం.
ఏదేమైనా అమలాపాల్ గరెండో పెళ్లి గ్రాండ్ గా జరగడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పలువురు సెలబ్రెటీలు, నెటిజన్లు వీరికి వివాహా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
వీరి పెళ్లి కేరళలోని గ్రాండ్ హయత్ కొచ్చి బోల్గట్టి రిసార్ట్ లో జరిగింది. అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అమలాపాల్ కెరీర్ లోనూ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టనుంది. ఇప్పుడు కేవలం మలయాళ సినిమాల్లోనే నటిస్తోంది.