MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ కుటుంబాల చేతిలో చిత్ర పరిశ్రమ.. అందుకే దూరమయ్యా.. టాలీవుడ్‌పై అమలాపాల్‌ సంచలన వ్యాఖ్యలు

ఆ కుటుంబాల చేతిలో చిత్ర పరిశ్రమ.. అందుకే దూరమయ్యా.. టాలీవుడ్‌పై అమలాపాల్‌ సంచలన వ్యాఖ్యలు

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఆ కుటుంబాలదే ఆధిపత్యం అంటూ షాకింగ్స్ కామెంట్స్ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 12 2022, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2011లో `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్‌(Amala Paul). `లవ్‌ ఫెయిల్యూర్‌`, `నాయక్‌, `ఇద్దరమ్మాయిలతో`, `జెండా పైకపిరాజు` చిత్రాల్లో మెరిసింది. కేవలం `నాయక్‌` ఒక్కటే ఆమెకి తెలుగులో సక్సెస్‌ని ఇచ్చింది. మిగిలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో అమలా పాల్‌ తెలుగుకి దూరమయ్యింది. చాలా రోజుల తర్వాత ఇటీవల ఓటీటీ ఫిల్మ్ `పిట్టకథలు` చేసి ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణమేంటనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అమలాపాల్‌. ఈ సందర్భంగా టాలీవుడ్‌(Tollywood)పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొన్ని ఫ్యామిలీల చేతుల్లోనే ఉందని అర్థమైందని, ఆ ఫ్యామిలీలు మాత్రమే టాలీవుడ్‌ని శాషిస్తుంటాయని, ఆధిపత్యం చెలాయిస్తుంటాయని చెప్పి షాకిచ్చింది. 
 

36

ఆ టైమ్‌లో వారు తీసే సినిమాలు డిఫరెంట్‌గా ఉండేవని, ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారని, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్‌గానే చూపించేవారని తెలిపింది. కొన్ని లవ్‌ సీన్లు, సాంగ్స్ లోనే హీరోయిన్లు కనిపించే వారని, మిగిలినదంతా హీరోనే ఉండేవారని, పూర్తి కమర్షియల్‌ సినిమాలు తీసేవారని పేర్కొంది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి తాను దగ్గర కాలేకపోయానని, తక్కువ సినిమాలు చేశానని తెలిపింది అమలాపాల్‌. 
 

46

కోలీవుడ్‌లో సినిమాలు చేయడంపై ప్రశంసలు కురిపించింది. తమిళంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అమలాపాల్‌ మాట్లాడుతూ, కోలీవుడ్‌లో ఫిల్మ్ మేకర్స్ కొత్త హీరోయిన్ల కోసం వెతుకున్న సమయంలో నేను తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాను. అక్కడ కూడా ఆడిషన్స్, మీటింగ్స్‌ అంటూ ఏడాది పాటు ఇబ్బంది పడ్డానని, అక్కడ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదలకాలేదని తెలిపింది. 
 

56

మూడో సినిమా `మైనా` సంచలన విజయం సాధించి తనకు మంచి గుర్తింపుని తీసుకురావడంతోపాటు ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసిందని చెప్పింది. `మైనా` తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయని, పెద్ద స్టార్స్ తోనూ కలిసి నటించే అవకాశాలు వచ్చాయని పేర్కొంది అమలాపాల్‌. 

66

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఇటీవల `కడెవర్‌` చిత్రంతో అలరించింది. ఇది ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం మలయాళంలో `టీచర్‌`, `క్రిస్టోఫర్‌`, `ఆడుజీవితం`(డిలే) చిత్రాల్లో నటిస్తుంది. మధ్య మధ్యలో వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved