- Home
- Entertainment
- వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న అమలా పాల్.. గొర్రెల కాపరీగా మారిన వైనం.. పోస్ట్ వైరల్
వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న అమలా పాల్.. గొర్రెల కాపరీగా మారిన వైనం.. పోస్ట్ వైరల్
అమలా పాల్ ఏమాత్రం ఖాళీ దొరికినా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంటుంది. వైల్డ్ లైఫ్‌ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది అమలాపాల్. లేటెస్ట్ గా ఆమె గొర్రెల కాపరీగా మారిపోవడం విశేషం.

డస్కీ అందాల భామ అమలాపాల్(Amala Paul) లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. గ్లామర్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఈ భామ ఇప్పుడు బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలే చేస్తుంది. బలమైన పాత్ర ఉంటే న్యూడ్‌గానూ కనిపించేందుకు వెనకడుగు వేయడం లేదు. ఆ మధ్య `ఆమె` చిత్రంలో న్యూడ్‌గా కనిపించి వాహ్ అనిపించింది.
మరోవైపు ఫ్రీ టైమ్‌లో వెకేషన్‌కి చెక్కేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం హిమాలయాల్లో విహరిస్తుంది. అందులో భాగంగా తీర్థన్ వ్యాలీ ప్రాంతంలోని జనాలను కలిసి అక్కడి సంస్కృతి సంప్రదాయలను తెలుసుకుంటుంది. అక్కడి మనుషులతో మమేకమైపోతుంది. అంతేకాదు గొర్రెల కాపరీగా మారడం విశేషం. Amala Paul Vacation Pics.
అమలా పాల్ గొర్రెపిల్లని తన ఒళ్లోకి తీసుకుని దానితో సరదాగా ఆడుకుంటుంది. దాన్ని మచ్చిక చేసుకుని ఫ్రెండ్‌గా మార్చుకుంది. ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇందులో అమలాపాల్ పెట్టిన పోస్ట్ సైతం ఆసక్తికరంగా మారింది. `తాను మంచి గొర్రెల కాపరిని` అని పేర్కొంది. దీంతో అభిమానులు స్పందిస్తూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. అమలా లవ్యూ అని, బ్యూటీఫుల్ అని, అమలా హ్యూమన్ బీయింగ్ అంటున్నారు. కొందరైతే ధమ్ బిర్యానీ రెడీ చేయమంటూ సెటైర్లు పేల్చడం విశేషం.
కొన్ని రోజులుగా అమలాపాల్ హిమాలయాల్లో ఎంజాయ్ చేస్తుంది. వర్షాలు పడే ఈ టైమ్‌లో అమలాపాల్ హిమాలయాల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడం మరింత ఆకట్టుకుంటుంది. అక్కడి పర్వత ప్రాంతాల్లో అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తుంది.
అమలా పాల్ దాదాపు ఏడేళ్ల తర్వాత ఇటీవల తెలుగులో మెరిసింది. `పిట్టకథలు` అనే ఓటీటీ ఫిల్మ్ లో నటించింది. ఆకట్టుకుంది. కానీమెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం నటించడం లేదు. అయితే ఆమెకి తెలుగు నుంచి ఆఫర్లు రాకపోవడమే ఆమె టాలీవుడ్‌కి దూరం కావడానికి కారణమని తెలుస్తుంది.
మరోవైపు ప్రస్తుతం అమలాపాల్ `ఆడు జీవితం`, `టీచర్`, `ది విక్టిమ్` సినిమాల్లో నటిస్తుంది. ఇక 2011లో `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ కేరళా కుట్టి అమలాపాల్. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద ఆదరణ దక్కలేదు. అయినా అమలాపాల్‌కి మంచి అవకాశాలొచ్చాయి.
రామ్‌చరణ్‌తో `నాయక్`, అల్లు అర్జున్‌తో `ఇద్దరమ్మాయిలతో` వంటి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ చేసింది. నాయక్ మంచి విజయాన్ని సాధించింది. కానీ బన్నీతో చేసిన `ఇద్దరమ్మాయిలతో` మూవీ పరాజయం చెందింది. ఇందులో ఆమె పాత్ర చనిపోతుందనే విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నానితో `జెండా పై కపిరాజు` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత తెలుగుకి దూరమైంది. మళ్లీ తెలుగు వైపు చూడలేదు. కానీ ఆమె నటించిన `ఆమె` చిత్రాన్ని తెలుగులో విడుదల చేయగా, మంచి ఆదరణతోపాటు ప్రశంసలు దక్కాయి.