- Home
- Entertainment
- చైతూ గురించి చెప్పాల్సి వస్తే.. అమల అక్కినేని రియాక్షన్ ఇదే.. అఖిల్ కంటే నాగచైతన్య గురించే ఎక్కువ..
చైతూ గురించి చెప్పాల్సి వస్తే.. అమల అక్కినేని రియాక్షన్ ఇదే.. అఖిల్ కంటే నాగచైతన్య గురించే ఎక్కువ..
హీరో నాగచైతన్య పై అక్కినేని అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని వెల్లడించారు. ఎలా ఉంటారో తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అఖిల్ కంటే చైతూ గురించే బాగా చెప్పడం విశేషం.

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)పై అమల(Amala) అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చైతూని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడటం విశేషం. నాగచైతన్య చాలా తెలివైన వాడట. అతనికి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, ఆ క్లారిటీతో ఉంటాడని తెలిపింది. అమల చాలా వరకు బయటకు రాదు. ఆమె పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌నే ఇష్టపడుతుంటారు. తన ఫౌండేషన్, ఏదైనా అవకాశం వస్తే సినిమాలు మాత్రమే చేస్తారు. కానీ ఆమె నాగచైతన్య గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
అమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జర్నలిస్ట్ `ప్రేమ` యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల అనేక విషయాల గురించి మాట్లాడారు. అందులో భాగంగా నాగచైతన్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనే యాంకర్ ప్రశ్నకి స్పందిస్తూ, నాగచైతన్య అత్యంత తెలివైన వాడని, అత్యంత ధైర్యవంతుడని తెలిపింది. అంతేకాదు కెరీర్ పట్ల, పని పట్ల చాలా ఫోకస్‌గా ఉంటాడట. అతనికి ఏం కావాలో క్లారిటీతో ఉంటాడని, చాలా బ్రిలియంట్ అని చెప్పింది అమల. చైతూని ప్రశంసలతో ముంచెత్తడం ఆశ్చర్యపరుస్తుంది. చైతూ అభిమానులను ఖుషి చేస్తుంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలోని వ్యాఖ్యలివి. అమల ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తన తనయుడు అఖిల్ (Akhil) గురించి కూడా చెప్పింది అమల. అఖిల్‌కి మనుషులంటే ఇష్టమట. పీపుల్ లవ్వింగ్ పర్సన్ అని, మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడని తెలిపింది. అఖిల్ కంటే చైతూ గురించే ఆమె ఎక్కువగా చెప్పడం విశేషం.
ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియాలో ట్రోల్స్ వంటి వాటిపై స్పందించారు. సోషల్ మీడియా కంటే ప్రింట్ మీడియా చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని, అది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందని ఆమె బోల్డ్ కామెంట్స్ చేశారు. దానితో పోల్చితే సోషల్ మీడియా చాలా తక్కువ అని పేర్కొంది. దీంతోపాటు ఆమె స్టూడియో, తన ఫౌండేషన్ గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. సినిమాల్లో మహిళల పాత్రల్లో వస్తోన్న మార్పులను కూడా ఆమె ప్రస్తావించారు.
అమల.. నాగార్జున(Nagarjuna) రెండో భార్య అనే విషయం తెలిసిందే. మొదటి భార్య లక్ష్మి. ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు. వీరికి నాగచైతన్య జన్మించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ ఇద్దరు విడిపోయారు. తర్వాత సినిమాలు చేసే క్రమంలో తనలో కలిసి నటించిన అమలని ఇష్టపడ్డాడు నాగార్జున. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు. కానీ అమల చైతూ, అఖిల్‌ని సమానంగా చూసుకుంటుంది. ప్రస్తుతం అమల సినిమాలు తగ్గించింది. ఏదైనా బలమైన పాత్రలు, ఇంపార్టెంట్ ఉన్న పాత్రలు వస్తేనే చేస్తుంది. ఇటీవల ఆమె శర్వానంద్ నటించిన `ఒకే ఒక జీవితం`లో అమ్మ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.