- Home
- Entertainment
- బన్నీ భార్య ముందు టాప్ మోడల్స్, స్టార్స్ హీరోయిన్స్ నథింగ్... వైరల్ గా స్నేహారెడ్డి గ్లామరస్ పిక్స్
బన్నీ భార్య ముందు టాప్ మోడల్స్, స్టార్స్ హీరోయిన్స్ నథింగ్... వైరల్ గా స్నేహారెడ్డి గ్లామరస్ పిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి(Allu Snehareddy) గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. స్నేహారెడ్డి సైలిష్ లుక్ చూస్తుంటే గుండె గుభేల్ మంటుంది. ఆమె అందం ముందు టాప్ మోడల్స్, స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే అన్నట్లున్నారు.

Allu Snehareddy-Allu Arjun
టాలీవుడ్ ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోల భార్యలు అసలు కెమెరా ముందు రావడానికే ఇష్టపడేవారు కాదు. అసలు కొందరు హీరోల సతీమణులు గురించి అభిమానులకు కూడా తెలియదు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ వైఫ్స్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు.
Allu Snehareddy-Allu Arjun
కాలానికి తగ్గట్లుగా అన్నీ మారిపోతున్నాయి. హీరోలకు సమానంగా వాళ్ళ భార్యలు ఫేమ్ రాబడుతున్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, బన్నీ వైఫ్ స్నేహారెడ్డి, మహేష్ వైఫ్ నమ్రత, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ సొసైటీలో తమకంటూ ఓ ఇమేజ్, గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్లకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Allu Snehareddy-Allu Arjun
దాని కారణం పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నమా వంటి వంటింటి కుందేలు ఆలోచనలు పక్కనబెట్టి తమదైన రంగాల్లో రాణిస్తున్నారు. కోట్లు సంపాదించే భర్తలు ఉన్నప్పటికీ కెరీర్ కోసం పాకులాడుతున్నారు. ఓ హీరో వైఫ్ అనే గుర్తింపుకు మించి ఏదో కోరుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు బిజినెస్ లు చేస్తుంటే మరికొందరు నటులుగా కొనసాగుతున్నారు.
ఇక బన్నీ వైఫ్ విషయానికొస్తే ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె మోడల్ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. సదరు అల్ట్రా స్టైలిష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Allu Sneha Reddy
సహజంగానే చక్కని అందం, శరీరాకృతి కలిగిన స్నేహారెడ్డి టాప్ మోడల్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. ఒక ప్రక్క హౌస్ వైఫ్ గా ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా ఇలా తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తున్నారు. తనకున్న అభిరుచిని చాటుకుంటున్నారు.
Allu Sneha Reddy
స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఫ్యామిలీ, పర్సనల్ ఫొటోస్, ఈవెంట్స్ గురించి ఆమె ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. స్నేహారెడ్డికి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 7.9 మిలియన్ ఫాల్లోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు, పాపులారిటీలో ఆమె రేంజ్ ఏమిటో.
2020 డిసెంబర్ లో జరిగిన స్నేహారెడ్డి వివాహ వేడుకల్లో స్నేహారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫంక్షన్ వేర్ లో అద్భుతంగా తయారైన అల్లు అర్జున్(Allu Arjun), స్నేహారెడ్డి ఫోటోలు నేషనల్ వైడ్ న్యూస్ అయ్యాయి. ఇక పుష్ప 2 (Pushpa 2)షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. ఇక బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ విదేశాల్లో ఘనంగా జరిగాయి.