- Home
- Entertainment
- Allu Arjun: బన్నీ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నాడా.. ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, హోమం ?
Allu Arjun: బన్నీ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నాడా.. ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, హోమం ?
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఇండియాలో బన్నీ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఇండియాలో బన్నీ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి.
దీనితో పుష్ప పార్ట్ 2ని పార్ట్ 1 కి మించేవిధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని నిలబెట్టుకోవడం పైనే ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టంతా ఉంది. దీనితో మరో చిత్రానికి కమిట్ కాకుండా బన్నీ కూడా పుష్ప 2 పైనే ఫోకస్ పెట్టాడు.
pushpa kerala box office
పుష్ప 2ని ప్రారంభించే ముందు అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్యుల ఆధ్వర్యంలో ఈ హోమం జరగబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమా ప్లానింగ్ భారీ స్థాయిలో ఉండబోతోంది.
సో భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా.. తన జ్యోతిష్యం ప్రకారం అల్లు అర్జున్ ఈ హోమం నిర్వహించనున్నాడట. అల్లు అర్జున్ సన్నిహితులు అతడికి హోమం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటనకు బాలీవుడ్ స్టార్లు సైతం ఫిదా అవుతున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు బన్నీతో నటించాలని ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంతలా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర ప్రభావం చూపింది.
పుష్పలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటించాడు. కూలీగా మొదలై స్మగ్లింగ్ సిండికేట్ కి డాన్ గా ఎలా మారాడు అనేది మొదటి భాగంలో చూపించారు. ఇక పార్ట్ లో డాన్ గా ఎదిగిన అల్లు అర్జున్ కి.. పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ కి మధ్య పోరాటం ఏవిధంగా ఉండబోతోంది అనేది చూపించబోతున్నారు.