ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది.. నేను కూడా రెడీ అంటున్న అల్లు అర్జున్ ?
ఈ తరం హీరోల్లో హీరోల్లో ఒకేసారి మల్టిపుల్ చిత్రాల్లో నటించడం అనేది చాలా అరుదు. ఒకప్పుడు హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పటి స్టార్ హీరోల క్యాలెండర్లలో సంవత్సరాలే తుడిచిపెట్టుకుని పోతున్నాయి.

ఈ తరం హీరోల్లో హీరోల్లో ఒకేసారి మల్టిపుల్ చిత్రాల్లో నటించడం అనేది చాలా అరుదు. ఒకప్పుడు హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పటి స్టార్ హీరోల క్యాలెండర్లలో సంవత్సరాలే తుడిచిపెట్టుకుని పోతున్నాయి. ఇక మల్టిపుల్ చిత్రాల్లో నటించే తీరిక ఎక్కడిది.
స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడే అది చేసి చూపిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఒకేసారి రెండు మూడు చిత్రాలకు సైన్ చేస్తూ పార్లల్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ప్రభాస్ స్ట్రాటజీనే ఫాలో అయ్యేందుకు మరో పాన్ ఇండియా హీరో సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 తో అతిపెద్ద పాన్ ఇండియా హిట్ ని ఖాతాలో వేసుకున్నారు.
ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇది మైథలాజికల్ టచ్ ఉన్న కథ. కాబట్టి చాలా టైం పడుతుంది. ఈ చిత్రానికి మాత్రమే పరిమితం కావాలని బన్నీ అందుకోవడం లేదు. మరో చిత్రాన్ని కూడా ఒకే చేసి పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ముందుగా అట్లీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీని కలసి నప్పటికీ అది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే అట. అట్లీ చెప్పే కథ ఎగ్జైట్ చేస్తే బన్నీ వెంటనే ఓకె చేయడం ఖాయంగా కనిపిస్తోంది.