- Home
- Entertainment
- pushpa 3కి కమిట్ అయిన అల్లు అర్జున్, సుకుమార్..? రిలీజ్ అప్పుడే.. బాలీవుడ్ స్టార్‌ని దించుతున్నారా?
pushpa 3కి కమిట్ అయిన అల్లు అర్జున్, సుకుమార్..? రిలీజ్ అప్పుడే.. బాలీవుడ్ స్టార్‌ని దించుతున్నారా?
`పుష్ప` అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీకి మరో సీక్వెల్ ఉండబోతుందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది.రిలీజ్ డేట్ కూడా చక్కర్లు కొడుతుంది.

pushpa2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్ తో `పుష్ప 2` రూపొందుతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి రెండో పార్ట్ గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజ్ న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తుంది.
`పుష్2`కి మరో సీక్వెల్ ఉంటుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆ మధ్య ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అల్లు అర్జున్.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. `పుష్ప 3` ఉండొచ్చు, ఇంకా చాలా పార్ట్ లు కూడా చేయోచ్చు అన్నారు. మూడో పార్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
లేటెస్ట్ సమాచారం మేరకు `పుష్ప 3` కూడా ఉండబోతుందట. అల్లు అర్జున్, సుకుమార్ మూడో పార్ట్ తీయాలని ఫిక్స్ అయ్యారు. `పుష్ప 2` కి సంబంధించిన కంటెంట్ చూసుకున్నాక, పార్ట్ 3 కచ్చితంగా అవసరం అని భావించారట. దీంతో `పుష్ప 3`ని కూడా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాదు ఔట్‌పుట్ చూసుకున్నాక ఈ మూవీని కచ్చితంగా ఆగస్ట్ 15కి విడుదల చేయాని నిర్ణయించుకున్నారట. డేట్‌ని మార్చేది లేదని ఫిక్స్ అయ్యారట.
మరోవైపు ఆ మూవీ విడుదలైన వెంటనే షూటింగ్ చేయనున్నారట. `పుష్ప2`తోపాటే మూడో పార్ట్ కి సంబంధించిన మేజర్‌పోర్షన్ సీన్లు చిత్రీకరిస్తారట. `పుష్ప 2` రిలీజ్ అయ్యాక మూడో పార్ట్ కి సంబంధించిన మిగిలిన పార్ట్ ని షూట్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చారట. వచ్చే ఏడాది సమ్మర్‌లో `పుష్ప 3` రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ మార్చి 8నుంచి ప్రారంభం కాబోతుంది. వైజాగ్‌లో చిత్రీకరిస్తారట. ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో బిగ్ స్టార్ యాడ్ కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. డాన్ పాత్రలో `పుష్ప 2`లోనే ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇందులో నిజమెంతో తెలియాలి. ఇక రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న `పుష్ప2`లో ఫహద్ ఫాజిల్ నెగటివ్‌రోల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ మూవీని పాన్ ఇండియా స్కేల్‌లో రిలీజ్ చేస్తున్నారు.