పుష్ప 2కి భారీగా ఛార్జ్ చేసిన రష్మిక, ఆ హీరో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ, ఎన్ని కోట్లు అంటే?
పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లకు చేరినట్లు సమాచారం. అందులో స్టార్స్ రెమ్యూనరేషన్ కే అధిక శాతం కేటాయించారట. రష్మిక సైతం భారీగా ఛార్జ్ చేశారట.
Pushpa 2 Movie
పుష్ప 2 విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో చిత్ర ఫలితంపై ఆసక్తి నెలకొంది. పుష్ప 2 దాదాపు రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ లో ఈ చిత్రం పై విపరీతమైన ఆసక్తి ఉంది.
పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లు అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో అది దాదాపు రూ. 500 కోట్లకు చేరిందట. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ నిర్ణీత సమయానికి పూర్తి చేయని కారణంగా సుకుమార్ పై అల్లు అర్జున్ కోప్పడ్డారని, డైరెక్టర్-హీరో మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు వినిపించాయి.
పుష్ప 2 బడ్జెట్ లో అధిక భాగం రెమ్యూనరేషన్ రూపంలో ఖర్చు చేశారట. లాభాల్లో వాటా అడిగిన అల్లు అర్జున్ కి పుష్ప 2 ద్వారా రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కినట్లు అవుతుంది.
కాగా రష్మిక మందాన సైతం భారీ మొత్తంలో ఛార్జ్ చేశారట. కెరీర్లో హైయెస్ట్ పుష్ప 2 చిత్రానికి ఆమె తీసుకున్నారట. రూ. 10 కోట్లు రష్మిక మందానకు పుష్ప 2 నిర్మాతలు రెమ్యూనరేషన్ గా చెల్లించారని సమాచారం. తన తోటి హీరోయిన్స్ ని రష్మిక అధిగమించింది. మరొక విశేషం ఏమిటంటే... పుష్ప 2కి ఫహద్ ఫాజిల్ రూ. 8 కోట్లు తీసుకున్నారట.
మలయాళంలో హీరోగా ఉన్న ఫహద్ ఫాజిల్ కంటే రష్మిక మందాన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారటన్న మాట. ప్రస్తుతం రష్మిక మందాన డిమాండ్ ఉన్న హీరోయిన్. బాలీవుడ్ లో సైతం స్టార్స్ సరసన చిత్రాలు చేస్తుంది. యానిమల్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో మేకర్స్ ఆమెకు కోట్లు కుమ్మరించారని తెలుస్తుంది.
2021లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా హిట్ నమోదు చేసింది. వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది. అల్లు అర్జున్ కి నార్త్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది.
దానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 రికార్డు థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ అనంతరం టాలీవుడ్ నుండి నాన్ రాజమౌళి మూవీతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.