MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రాన్స్ లోకి వెళ్లిపోయాను.. కాంతార చాప్టర్ 1 సినిమాపై అల్లు అర్జున్ సెన్సేషనల్ రివ్యూ...

ట్రాన్స్ లోకి వెళ్లిపోయాను.. కాంతార చాప్టర్ 1 సినిమాపై అల్లు అర్జున్ సెన్సేషనల్ రివ్యూ...

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది కాంతార చాప్టర్ 1 మూవీ. ఈసినిమాపై కాస్త లేట్ గా స్పందించారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈసినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

2 Min read
Mahesh Jujjuri
Published : Oct 24 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాంతార చాప్టర్ 1 పై స్పందించిన అల్లు అర్జున్
Image Credit : Asianet News

కాంతార చాప్టర్ 1 పై స్పందించిన అల్లు అర్జున్

దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమాపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ అంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈక్రమంలో ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. రీసెంట్ గా ఈసినిమాను చూసిన ఐకాన్ స్టార్.. ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

24
మైండ్‌బ్లోయింగ్ సినిమా
Image Credit : Asianet News

మైండ్‌బ్లోయింగ్ సినిమా

అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ఇలా రాశారు, “నిన్న రాత్రి ‘కాంతార’ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను. మైండ్‌ బ్లోయింగ్ సినిమా చూశాను, సినిమా చూసేంతసేపు ఒక ప్రత్యేక అనుభూతిలో మునిగిపోయాను' అని అల్లు అర్జున్ తెలిపారు.” ఈ సందర్భంగా బన్నీ ఈసినిమా రచయిత, దర్శకుడు, రిషబ్ శెట్టిపై ప్రశంసల జల్లు కురిపించారు. “రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు” అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.

Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.

Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.

Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd

— Allu Arjun (@alluarjun) October 24, 2025

Related Articles

Related image1
40 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్ల ఆస్తి, ఫిల్మ్ ఇండస్ట్రీ తనను వెలివేసిందని ఆరోపించిన హీరోయిన్ ?
Related image2
బెట్టు కట్టి డబ్బులు పోగొట్టుకున్న శోభన్ బాబు, స్టార్ హీరో ను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా?
34
మాటలు సరిపోవడంలేదు..
Image Credit : Asianet News

మాటలు సరిపోవడంలేదు..

ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరిని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. వారి నటనను, పనితీరును ప్రశంసించారు. “రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య నటన అద్భుతంగా ఉంది” సంగీత దర్శకుడు అజనీశ్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగే, స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాదు ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబలే ఫిలిమ్స్ బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. “నిజాయతీగా చెప్పాలంటే, ‘కాంతార’ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు” అంటూ తన పోస్ట్‌ లో చివరి మాటగా రాశారు ఐకాన్ స్టార్.

44
కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు
Image Credit : Instagram

కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా చిత్రంలోని స్థానిక సంస్కృతి, దైవ భక్తి, ప్రకృతి నేపథ్య అంశాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. అంతేకాకుండా, కాంతార బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 8‌‌00 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. త్వరలో 1000 కోట్ల మార్క్ దాటుతుందని టీమ్ నమ్ముతున్నారు. కేజీయఫ్ తరువాత కన్నడ సినిమాను జాతీయ స్థాయిలో మరోసారి నిలిపిన సినిమాగా కాంతార చాప్టర్ 1 గుర్తింపు తెచ్చుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
Recommended image2
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?
Recommended image3
Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
Related Stories
Recommended image1
40 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్ల ఆస్తి, ఫిల్మ్ ఇండస్ట్రీ తనను వెలివేసిందని ఆరోపించిన హీరోయిన్ ?
Recommended image2
బెట్టు కట్టి డబ్బులు పోగొట్టుకున్న శోభన్ బాబు, స్టార్ హీరో ను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved