- Home
- Entertainment
- 40 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్ల ఆస్తి, ఫిల్మ్ ఇండస్ట్రీ తనను వెలివేసిందని ఆరోపించిన హీరోయిన్ ?
40 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్ల ఆస్తి, ఫిల్మ్ ఇండస్ట్రీ తనను వెలివేసిందని ఆరోపించిన హీరోయిన్ ?
ఆమె ఒక స్టార్ హీరోయిన్ హీరోలను మించి రెమ్యునరేషన్ తీసుకున్ననటి, దాదాపుగా 1000 కోట్ల ఆస్తులున్న బ్యూటీ. ఇండస్ట్రీ తనను వెలివేసిందంటూ ఆరోపణలు చేసిన తార.. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ సినిమా చేస్తోన్న నటి ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీ మాయా ప్రపంచం
సినీపరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. ఇందులో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. టాలెంట్ ఉంటే అదృష్టం కలిసిరాదు.. అదృష్టం కలిసి వచ్చినవారు టాలెంట్ లేక ఎదగలేరు.. ఈరెండు కలిసి వచ్చినవారు ప్రస్తుతం ఓ రేంజ్ లో స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు. గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు... ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్టుకురాగలరు.. అని దివంగత సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంల్లో వెల్లడించారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ కూడా చాలా డిఫరెంట్, ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ ప్రియాంక చోప్రా. కానీ బాలీవుడ్ తనను వెలివేసినంత పనిచేసిందంటూ ఆమె బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్..
ఫోర్బ్స్, DNA వంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రియాంక చోప్రా ఒక ప్రాజెక్ట్‌కి ఏకంగా 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన ప్రియాంక.. తాజాగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న పాన్ వరల్డ్ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోకు సమామైన పాత్రలో ప్రియాంక కనిపించబోతోంది. ప్రీయాంక కోసం ప్రత్యేకంగా యాక్షన్స్ సీన్స్ ను రాజమౌళి డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈసినిమా కోసం ఆమె 35 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
మోడలింగ్ నుంచి హీరోయిన్ గా
బీహార్‌లో పుట్టిన ప్రియాంక చోప్రా తండ్రి ఆర్మీ అధికారి. మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి, 2002లో విజయ్ దళపతి జోడీగా తమిజన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత బాలీవుడ్‌కి అడుగుపెట్టి వరుసగా హిట్ సినిమాలు చేసింది. ముజ్సే షాదీ కరోగి, డాన్, ఫ్యాషన్, బాజీరావ్ మస్తాని వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా స్థిరపడింది. ఇక ప్రియాంక చోప్రా తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హాలీవుడ్‌కి వెళ్ళింది. అక్కడ క్వాంటికో సిరీస్ ద్వారా వరల్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక
బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అవ్వడం అంటే మాటలు కాదు.. అక్కడ మళ్లీ ఆడిషన్స్ ఇచ్చి..తమను తాము నిరూపించుకోవాలి. ఈ విషయంలో ప్రియాంక తన టాలెంట్ చూపించింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ఇండియన్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ముందుంది. అంతే కాదు బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్ కు వెళ్లడానికి గల కారణాలను కూడా ప్రియాంక ఓ సందర్భంలో వెల్లడించింది. “బాలీవుడ్‌లో రాజకీయాలు ఎక్కువయ్యాయి. కొందరు నాకు ఆఫర్లు రాకుండా చేశారు. వాళ్లతో నాకు వివాదాలు జరిగాయి. అందుకే ఇండస్ట్రీని వీడాల్సి వచ్చింది” అని ప్రియాంక చోప్రా పరోక్షంగా వెల్లడించింది.
భర్త కంటే వయసులో పదేళ్లు పెద్ద
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యింది. హాలీవుడ్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ను పెళ్లాడింది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఒక కూతురు పుట్టింది. నిక్ జోనాస్ వయసులో ప్రియాంక చోప్రా కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఇక ఆస్తుల విషయానికి వస్తే.. రీసెంట్ గా ఇండియాలో ఉన్న కొన్ని ఆస్తులను ప్రియాంక చోప్రా అమ్మేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో ఉన్న ఆస్తులన్నీ కలుపుకుని దాదాపు 1000 కోట్లు ఉంటాయని ఓ అంచన. ఈ విషయం అఫీషియల్ గా మాత్రం తెలియదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తోన్న ప్రియాంక.. అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ వెళ్తున్నారు. ఫారెన్ లో ఇండియన్ ఫెస్టివల్స్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది గ్లోబల్ బ్యూటీ.

