- Home
- Entertainment
- స్నేహ రెడ్డితో బన్నీ లవ్ ఎఫైర్..ఫస్ట్ సమంతకి మాత్రమే ఎందుకు చెప్పాడో తెలుసా, క్రేజీ డీటెయిల్స్
స్నేహ రెడ్డితో బన్నీ లవ్ ఎఫైర్..ఫస్ట్ సమంతకి మాత్రమే ఎందుకు చెప్పాడో తెలుసా, క్రేజీ డీటెయిల్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఇండియన్ మొత్తం ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఇండియన్ మొత్తం ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. పుష్ప చిత్రంలో తన మ్యానరిజమ్స్, డైలాగ్స్, స్టెప్పులతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన బన్నీ పుష్ప 2 తో ఏం చేయబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా నేడు అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి 13 వ వెడ్డింగ్ యానవర్సరీ. దీనితో బన్నీ, స్నేహాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ తన సతీమణిని పొగుడుతూ 13వ మ్యారేజ్ యానవర్సరీ రోజున అల్లు అర్జున్ బ్యూటిఫుల్ పోస్ట్ కూడా చేశారు.
తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్ చంద్రశేఖర్ రెడ్డి కుమర్తె స్నేహ రెడ్డి. ఈ రోజు బన్నీ స్నేహ పెళ్లి రోజు కాబట్టి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలయింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బన్నీ, స్నేహ ప్రేమకి ఎలాంటి ఆటంకాలు జరగలేదు. చాలా మంది పెద్దలు ప్రేమ పెళ్లిళ్లు అంటే అడ్డు చెబుతారు. కానీ వరుడు చిత్ర సమయంలో అల్లు అర్జున్ ప్రేమించినా పర్వాలేదు.. ఆఅమ్మాయితోనే పెళ్లి చేస్తాం అని అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఆ మరుసటి ఏడాది 2011లో బన్నీ, స్నేహ వివాహం జరిగింది. అల్లు అర్జున్ తొలిసారి స్నేహని ఒక నైట్ క్లబ్ పార్టీలో చూశాడట. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసింది కూడా సమంత. సమంత సామ్ జామ్ చాట్ షోలో అల్లు అర్జున్ తన భార్య గురించి వివరించారు.
సాధారణంగా నైట్ క్లబ్ లో అమ్మాయిలని చూస్తే ఏదేదో అనుకుంటారు. కానీ స్నేహ తనకి చాలా డిగ్నిఫైడ్ గా కనిపించింది అని బన్నీ తెలిపారు. ఎక్కడ ఉన్న స్నేహ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అదే నాకు ఆమెలో నచ్చిన క్వాలిటీ అని అల్లు అర్జున్ తెలిపాడు.
పెళ్ళికి ముందు తాను స్నేహ రెడ్డిని ప్రేమిస్తున్నానే విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసు. అందులో ఒకరు సమంత అని బన్నీ తెలిపాడు. అసలు సమంతకి మాత్రమే ఎందుకు చెప్పానో ఇప్పటికి అర్థం కావడం లేదని అల్లు అర్జున్ సరదాగా అన్నారు. వెంటనే సమంత రియాక్ట్ అవుతూ.. అవును ఆరోజు బన్నీ చిన్న పిల్లాడిలా కనిపించాడు. స్నేహ ఒప్పుకుంటుందా లేదా అంటూ టెన్షన్ పడిపోయినట్లు సమంత రివీల్ చేసింది.