MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Allu Arjun: ఒక్క సినిమాకి 300కోట్లు.. పారితోషికంలో అల్లు అర్జున్‌ నయా ట్రెండ్‌.. తెరవెనుక భారీ ప్లాన్‌

Allu Arjun: ఒక్క సినిమాకి 300కోట్లు.. పారితోషికంలో అల్లు అర్జున్‌ నయా ట్రెండ్‌.. తెరవెనుక భారీ ప్లాన్‌

Allu Arjun: అల్లు అర్జున్.. అట్లీ, సన్ పిక్చర్స్ కాంబోలో రాబోయే భారీ సినిమా కోసం కొత్త రెమ్యూనరేషన్ పద్ధతిని ఫాలో అవుతున్నారు.  ఇలా చేస్తే ఏకంగా మూడు వందల కోట్ల పారితోషికంగా రాబోతుందట.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 08 2026, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అట్లీ మూవీతో గ్లోబల్‌ మార్కెట్‌పై కన్నేసిన అల్లు అర్జున్‌
Image Credit : alluarjunonline instagram

అట్లీ మూవీతో గ్లోబల్‌ మార్కెట్‌పై కన్నేసిన అల్లు అర్జున్‌

`పుష్ప 2`తో అల్లు అర్జున్‌ సంచలనం సృష్టించారు. ఆయన మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ప్రభాస్‌ తర్వాత బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్‌ని దాటి నెంబర్‌ 1 స్టార్‌గా ఎదిగే ప్రణాళికలు సిద్ధం  చేస్తున్నారు. అందులో భాగంగా అట్లీతో సినిమా చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని గ్లోబల్‌ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది.  ఈ క్రమంలో ఇప్పుడు పారితోషికం విషయంలోనూ నయా ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు బన్నీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 రూ.800కోట్ల బడ్జెట్‌తో అల్లు అర్జున్‌-అట్లీ మూవీ
Image Credit : AlluArjunonline/Instagram

రూ.800కోట్ల బడ్జెట్‌తో అల్లు అర్జున్‌-అట్లీ మూవీ

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న `ఏఏ22` సినిమాను సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.  హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ కోసం అట్లీ, అల్లు అర్జున్ ఇటీవల అమెరికా వెళ్లడం విశేషం. ఇది  సైన్స్ ఫిక్షన్ (Sci-fi) జానర్ సినిమాగా ఉంటుందని  సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే సమ్మర్‌కి మూవీని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Related Articles

Related image1
Senior Heroes Fight: ఒకేసారి నలుగురు సీనియర్ల సినిమాలు, టాలీవుడ్‌ చరిత్రలో మొదటిసారి.. అసలు పండగ ఇదే
Related image2
Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?
36
 అల్లు అర్జున్‌ పారితోషికం
Image Credit : facebook.com/AlluArjun

అల్లు అర్జున్‌ పారితోషికం

అయితే ఈ మూవీకి పారితోషికం విషయంలో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు అల్లు అర్జున్‌. షేరింగ్‌ సిస్టమ్‌ని ముందుకు తీసుకొస్తున్నారట. బిజినెస్‌లో వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమాకి కేవలం ఒకేసారి రెమ్యూనరేషన్ తీసుకోవడం కాకుండా, లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారట.

ప్రాథమిక పారితోషికం

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సుమారు ₹175 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారని సమాచారం.

లాభాల్లో వాటా

ఇది కాకుండా, సినిమా మొత్తం ఆదాయంలో 27% నుంచి 30% వరకు వాటా (Share) అడిగినట్టు తెలుస్తోంది.

మొత్తం ఆదాయం

సినిమా బిజినెస్, వసూళ్లు ₹1000 కోట్లు దాటితే, అల్లు అర్జున్ మొత్తం ఆదాయం ₹300 కోట్లు దాటే అవకాశం ఉంది. దీనితో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే ఇలాంటి పెద్ద లాభాల వాటా పద్ధతిని పాటించారు.

46
 అట్లీకి వంద కోట్లు
Image Credit : facebook.com/AlluArjun

అట్లీకి వంద కోట్లు

'జవాన్' సినిమా ₹1000 కోట్ల వసూళ్ల తర్వాత, అట్లీ మార్కెట్ అమాంతం పెరిగింది. అల్లు అర్జున్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా కోసం అట్లీకి ₹100 కోట్ల పారితోషికం మాట్లాడుకున్నట్టు సమాచారం.  సన్ పిక్చర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

56
అంతర్జాతీయ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బన్నీ మూవీ
Image Credit : AlluArjunonline/Instagram

అంతర్జాతీయ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బన్నీ మూవీ

దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్, ఎమోషన్‌తో కూడిన అట్లీ ట్రేడ్‌మార్క్ స్టైల్ ఉంటుందనడంలో సందేహం లేదు. సూపర్‌ హీరో ఎలిమెంట్లు వేరే లెవల్‌లో ఉంటాయని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు చూసేలా సినిమాని తీర్చిదిద్దుతున్నారట. ముఖ్యంగా అంతర్జాతీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. 

66
రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమాన సంఘాలు
Image Credit : Asianet News

రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమాన సంఘాలు

ఇక అల్లు అర్జున్‌ తన ఇమేజ్‌ని, క్రేజ్‌, అభిమానుల ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు మరో ప్లాన్‌ చేస్తున్నారు. అభిమాన సంఘాలను విస్తరిస్తున్నారు. వాటి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. అల్లు అర్జున్ అభిమాన అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో ఆదివారం హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 4–5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ప్రారంభించారు. ఇది బన్నీ ప్లాన్‌లో భాగంగానే జరుగుతుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Related Stories
Recommended image1
Senior Heroes Fight: ఒకేసారి నలుగురు సీనియర్ల సినిమాలు, టాలీవుడ్‌ చరిత్రలో మొదటిసారి.. అసలు పండగ ఇదే
Recommended image2
Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved