MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ పుష్ప విలన్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

అల్లు అర్జున్ పుష్ప విలన్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

Fahadh Faasil Buys Ferrari Purosangue SUV: అల్లు అర్జున్ పుష్ప విలన్, స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు కార్ల అంటే పిచ్చి. ఇప్పటికే తన గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారు కొనుగోలు చేస్తారు. ఇంతకీ కారు ఏంటీ? ధర ? ప్రత్యేకతలేంటీ?     

2 Min read
Author : Rajesh K
Published : Sep 03 2025, 10:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 కొత్త కారు కొన్న పుష్ప విలన్..
Image Credit : Saregama Tamil/ Youtube

కొత్త కారు కొన్న పుష్ప విలన్..

Fahadh Faasil: దక్షిణాది స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఒకరు. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో బ్యాక్-టూ-బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ అదరగొట్టేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రతో నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ఫహద్ ఇప్పుడు ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఆ స్టార్ హీరో తాజాగా వార్తల్లో నిలిచారు. ఎందుకంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫహద్ ఫాసిల్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు
Image Credit : https://www.instagram.com/automobiliardent/

ఫహద్ ఫాసిల్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు

స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ తాజా కొత్త ఫెరారీ SUV పురోసంజ్వా (Purosangue) కొనుగోలు చేశారు. ఫెరారీ ప్రారంభించిన అత్యాధునిక పెర్ఫార్మెన్స్ SUV మోడల్ ఇది. ఈ కారు ధర ₹13.75 కోట్లు. ఈ కారు వేగం, లగ్జరీ ఫీచర్స్ అన్ని అత్యంత ప్రత్యేకం. తమిళ హీరో విక్రమ్, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులూ ఈ కొనుగోలు చేశారు. అలాగే.. కేరళలో ఈ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా ఫహద్ నిలిచారు.

35
ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
Image Credit : https://www.instagram.com/automobiliardent/

ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue)ఈ శ్రేణిలో మొట్టమొదటి ఎస్యూవీ ( SUV) ఇదే . ఇందులో 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది 725bhpపవర్, 716 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.3 సెకన్లలో 100 kmph వేగాన్ని, 10.6 సెకన్లలో 0–200 kmph వేగం అందుకోగలదు. దీని గరిష్ట వేగం 310 kmph.SUVలో కార్బన్ సిరామిక్ బ్రేక్‌లు, యాక్టివ్ సస్పెన్షన్, ఫ్రంట్ యాక్సిల్ టార్క్ వెక్టరింగ్, వెనుక ఇ-డిఫరెన్షియల్, ఫోర్-వీల్ స్టీరింగ్ వంటి ఫీచర్స్ ఈ కారును ప్రత్యేకంగా మార్చుతున్నాయి. అందుకే ఈ కారు ఫెరారీలో ప్రత్యేక, లగ్జరీ SUVగా నిలుస్తుంది.

45
ఫహద్ కారు కలెక్షన్స్
Image Credit : X

ఫహద్ కారు కలెక్షన్స్

ఫహద్ గ్యారేజీలో ఇప్పటికే అనేక లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇందులో లంబోర్గిని ఉరుస్, మెర్సిడెస్ G63 AMG, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే 911 కారెరా, టయోటా వెల్‌ఫైర్, మినీ కంట్రీమ్యాన్, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI ఉన్నాయి. ఫహద్ లగ్జరీ ఆటోమొబైల్ కలెక్షన్ విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

55
సినీ కెరీర్
Image Credit : Muzik247/ Youtube

సినీ కెరీర్

ఫహద్ ఫాసిల్ తాజా చిత్రం ‘ఒడుం కుతిరా చదుం కుతిరా’ థియేటర్లలో రిలీజ్ అయింది. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించారు. కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా రేవతి పిళ్లై, లాల్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి, అనురాజ్, వినీత్ వాసుదేవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జస్టిన్ వర్గీస్ సంగీతం సమకూర్చారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
అల్లు అర్జున్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Related Stories
Recommended image1
బిగ్ బాస్ 9లో పుష్ప 2 పీలింగ్స్ సింగర్ కి ఛాన్స్ ? ఆమె రియాక్షన్ ఇదే.. భర్త, కొడుకు గురించి ఎమోషనల్ గా..
Recommended image2
పుష్ప 2 సంఘటనను గుర్తు చేసిన పవన్ క్రేజ్.. సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved