Pushpa 2: నేపాల్ లో భీభత్సం!! ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే
పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. నేపాల్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.
Allu Arjun, #Pushpa2, sukumar
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 రిలీజ్ తర్వాత వివాదాలు చుట్టు ముట్టినా కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అని దూసుకుపోతోంది. రిలీజ్ అయ్యి 15 రోజులు దాటినా ఎక్కడా బ్రేక్ పడటం లేదు. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా ఆగకుండా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
గురువారం (డిసెంబర్ 24) నాటికి ఈ సినిమా విడుదలై 20 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ హిందీలో వారం క్రితం రిలీజైన మాదిరిగానే వర్కవుట్ అవుతోంది. 20వ రోజైన గురువారం ఈ సినిమా రూ.14.25 కోట్లు వసూలు చేసిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ పేర్కొంది.
Pushpa 2, Sukumar, allu arjun
పుష్ప 2 చిత్రం అత్యధికంగా హిందీలో రూ.11.5 కోట్లు కొల్లగొట్టింది. ఓరిజినల్ వెర్షన్ తెలుగు, ఇతర వెర్షన్లలో వసూళ్లు నెమ్మదించినప్పటికీ హిందీ రాష్ట్రాల్లో వసూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం నాటికి దేశవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1075.60 కోట్లకు పెరిగాయి. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు శెలవులు కావడం కలిసి వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగవచ్చనే సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఇతర సినిమాల పోటీని కూడా తట్టుకొని పుష్ప-2 నిలబడుతుండడం విశేషం.
అలాగే పుష్ప 2 చిత్రం నేపాల్ లో 25Cr NPR[ 15.7 Cr మన కరెన్సీలో] వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ భారతీయ చిత్రం నేపాల్ లో ఈ స్దాయి కలెక్షన్స్ తేవటం అందరికీ షాక్ ఇస్తోంది. ఇంతకు ముందు కేజీఎఫ్ 2 చిత్రం అక్కడ 20Cr NPR కలెక్ట్ చేసింది.పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ ...నేపాల్ మార్కెట్ ని ఆక్రమించారనే చెప్పాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకు అక్కడ భీబత్సమైన క్రేజ్ ఏర్పడుతుందనటంలో సందేహం లేదు.
ఇప్పటికి పుష్ప-2 కలెక్షన్లు దేశవ్యాప్తంగా రూ.700 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు దాటేసిన విషయం తెలిసిందే. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. అటు నార్త్ బెల్ట్ లోను పుష్ప రాజ్ ర్యాంపేజ్ ఆగటం లేదు అని చెప్పాలి.
అక్కడి స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాల ను సైతం వెనక్కి నెట్టి రికార్డ్ కలెక్షన్స్ అందుకుంది. ఈ లెక్కన చుస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో రూ. 2000 కోట్ల మార్క్ ను అందుకున్న ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2: ది రూల్' వసూళ్ల సునామీ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో, బాలీవుడ్ లో సుప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఓ ప్రకటన చేసింది. పుష్ప-2 టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపింది.
"రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోతుంటాయి... కొత్త రికార్డులు వస్తుంటాయి. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. ఫైర్ నహీ... వైల్డ్ ఫైర్ (మామూలు ఫైరు కాదు... వైల్డ్ ఫైరు)" అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది.