`పుష్ప 2` కలెక్షన్ల ప్రకటన, రేవంత్ రెడ్డికి కౌంటరా? వివాదంలో కొత్త కోణం, వెర్రి పుష్పం ఎవరంటే?
అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమాకి సంబంధించిన కలెక్షన్లని ప్రకటించింది యూనిట్. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ ప్రకటన రావడం చర్చనీయాంశం అవుతుంది.
అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో డల్‌గానే ఉన్నా, నార్త్ ఇండియాలో మాత్రం బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. అక్కడ భారీ కలెక్షన్లని సాధించింది. హిందీ మార్కెట్‌లో ఇప్పటికే అత్యధిక షేర్ సాధించిన మూవీగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఏడు వందల కోట్లకుపైగా షేర్ ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే డల్‌గా ఉంది. సౌత్‌లోనూ అంతగా ప్రభావం చూపించడం లేదు. ఓవర్సీస్ కూడా మామూలుగానే ఉంది. కానీ హిందీ మార్కెట్‌లో సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్.
తాజాగా ఈ మూవీ 21 రోజుల కలెక్షన్లని ప్రకటించింది టీమ్. ఈ మూవీ సంచలన కలెక్షన్లని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1705 కోట్లు సాధించినట్టుగా కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది టీమ్. ఈ మూవీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని టీమ్ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమానే కాదు, హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన ఇండియన్ మూవీస్‌లో టాప్ 3లో నిలిచింది.
ఇప్పటికే రెండు వేల కోట్లతో `దంగల్` మొదటి స్థానంలో ఉంది. 1800కోట్లతో `బాహుబలి 2` రెండో స్థానంలో నిలవగా, `పుష్ప 2` మూడో స్థానాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఈ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఓ వైపు `పుష్ప 2` వివాదం నడుస్తుంది. నేషనల్ వైడ్‌గా దీనికి సంబంధించిన చర్చ నడుస్తుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ వచ్చింది. ఇటీవల పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వాధికారులతో టాలీవుడ్ పెద్దలు మీట్ అయ్యింది.
ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యనెలకొన్న వివాదానికి సంబంధించిన చర్చ నడిచింది. ఈ క్రమంలో ఇక అన్ని వివాదాలు సమసిపోయినట్టే అని, ఇందులో అల్లు అర్జున్ వివాదం కూడా సెటిల్ అయినట్టే అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ చర్చలో తెలుగు చిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు మన హైదరాబాద్‌లో జరిగేలా చేయాలని, అంతర్జాతీయ స్థాయి వనరులు కల్పించాలని అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ స్టూడియో కావాలని నాగార్జున కూడా చెప్పినట్టు సమాచారం.
ఈ క్రమంలో ఇప్పుడు `పుష్ప 2` కలెక్షన్లు ప్రకటించడం విశేషం. అంటే సీఎం కామెంట్స్ కౌంటర్‌గానే ఈ కలెక్షన్లని ప్రకటించారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. సీఎం అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు, కానీ `పుష్ప 2` ఇప్పటికే అంతర్జాతీయంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఓ బ్రాండ్‌ని క్రియేట్ చేస్తుంది. చూడబోతుంటే ఇది కౌంటరే అనే టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్, తెలంగాణ ప్రభుత్వం భేటీ అనేది ఇక ఇండస్ట్రీతో ప్రభుత్వానికి ఉన్న అన్ని సమస్యలు సెట్ అయినట్టే అనే వాదన తెరపైకి వస్తుంది. గద్దర్ అవార్డులకు సంబంధించిన ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ సపోర్ట్ గా ఉండాలనేది కూడా తెలుస్తుంది. అది సామాజికంగా కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు. ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడం కూడా కావచ్చు.
సెస్ రూపంలో సినీ పరిశ్రమ నుంచి ఆర్థిక వనరులు సమీకరించాలనుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో సినీ పరిశ్రమ సహకరించాలని ఆయన వెల్లడించారు. ఈ కామెంట్ సరికొత్త చర్చకు దారితీస్తుంది.
ఈ మీటింగ్‌లో అల్లు అర్జున్ వివాదంగానీ, నాగార్జున ఎన్‌కన్వెన్షన్ వివాదం కాని సెట్ అయినట్టే అంటున్నారు. నిజానికి ఈ వివాదం ఎప్పుడో క్లోజ్ అయ్యిందట. లీగల్‌గా కేసు ఉంది కాబట్టి, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ, లోలోపల అంతా సెట్ అయిపోయింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రతిపక్షాలను, జనాలను తప్పుదోవ పట్టించే కార్యక్రమమే అని, ఈ మొత్తం ప్రాసెస్‌లో జనం వెర్రిపుష్పాలు అయ్యారని అర్థమవుతుంది.
ప్రభుత్వాలు ఎప్పుడైనా ఒకరిని టార్గెట్ చేశాయంటే అది పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, లోలోపల ఎన్నో కారణాలుంటాయి. అందులో ఆర్థికపరమైన, సామాజిక పరమైన అంశాలుంటాయి. కొందరి ప్రయోజనాలూ ఉంటాయి. అవి అర్థం కాక జనం వెర్రిపుష్పం అవుతుంటారు. ఈ ఘటనలోనూ అంతిమంగా అదే జరుగుతుందనేది విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్నా మాట.
read more: `సోఫా`లు చేరినట్టేనా? అంబటి రాంబాబు సంచలన ట్వీట్.. టాలీవుడ్, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించేనా?