AA 22 తర్వాత సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ.. టైటిల్ కూడా వైరల్
అట్లీ చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో సంచలన దర్శకుడి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో దర్శకత్వంలో ఓ భారీ సైన్స్‌ఫిక్షన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరగనుంది. అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్, ‘KGF’, ‘సలార్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సంచలన దర్శకుడితో బన్నీ నెక్స్ట్ మూవీ
బన్నీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ గురించి పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి, ఈ ప్రాజెక్ట్ 'రావణం' అనే టైటిల్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్
‘రావణం’ చిత్రం ప్రశాంత్ నీల్ కు చాలా కాలంగా ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని బలమైన ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ చిత్రాలలో హీరోల ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. డార్క్ థీమ్ లో కథలు ఉంటాయి. అలాంటి ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో జత కడితే సంచలనం గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ మూవీతో బిజీగా ప్రశాంత్ నీల్
ఇక మరోవైపు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ అనే ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా రుక్మిణి వసంత ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఇంకా ఏ నటి పేరూ నిర్ధారించలేదు.
ముంబైలో అట్లీ మూవీ షూటింగ్
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాకు సంబంధించిన 3 నెలల భారీ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. అలాగే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందే రావణంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.