పూజా హెగ్డే కు లైఫ్ ఇస్తానంటోన్న అల్లు అర్జున్, బుట్టబొమ్మతో ముచ్చటగా మూడో సినిమా..?
ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు.. ప్రస్తుతం ఐరన్ లెగ్ అన్న పేరు వచ్చింది. ఏ సినిమా చేసినా అది బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. ఈక్రమంలో ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
పాపం పూజ హెగ్డేకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూవచ్చిన ఈబ్యూటీని అదృష్టమంటే.. తనదే అన్నారు అంతా.. కాని ఆమె సాధించిన సినిమాలన్నీ.. వరుసగా ప్లాప్ అవుతూ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు పూజా ను ఐరన్ లెగ్ అంటున్నారు.
ముఖ్యంగా ప్రభాస్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించి సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అవ్వడంతో పూజాపై నెగెటీవు టాక్ గట్టిగా స్ప్రెడ్ అయ్యింది. దాంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ఉంటే.. ఈలోపు మహేష్ బాబు జోడీగా మరోసారి మంచి ఛాన్స్ వచ్చింది పూజాకి. గుంటూరు కారంలో హీరోయిన్ గా తీసకున్నాడు త్రివిక్రమ్.
కాని ఆమె ప్రభావమా..? లేక ఇంకేదో తెలియదు కాని.. ఈసినిమా షూటింగ్ కూడా సిరిగ్గా జరగలేదు. ఆమె కాలు విరగడం, మహేష్ బాబు ఫ్యామిలీల విషాదాలు, ఆయన టూర్లు.. ఇలా రకరకాల కారణాల వల్ల మూవీ షూటింగ్ డిలై అవుతూ వచ్చింది. ముందుగా పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ అయిపోయాయి .. ఆ తరువాత ఆమె తన డేట్స్ ను సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అందువలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో పూజాని తీసేశారు అనన టాక్ కూడా రావడంతో.. పూజా అంటే అమ్మో అనే పరిస్థితి వచ్చింది.
Pooja Hegde
ఏమి జరిగినా.. తను మాత్ర తొణకకుండా ఆత్మవిశ్వాసంతోనే కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతోంది.ఈ నేపథ్యంలోనే ఆమె మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో .. బన్నీ కాంబినేషన్లో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది.
ఈసినిమాలో హీరోయిన్ గా పూజాను పెడదామని అన్నాడట అల్లు అర్జున్. గతంలో వీరి కాంబోలో డిజె, అలవైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో ఇద్దరి జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న 'గుంటూరు కారం' .. బన్నీ చేస్తున్న 'పుష్ప2' పూర్తి కాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
Pooja Hegde
అటు బన్నీ కూడా పూజాపై నమ్మకంతో ఉన్నాడు. ఆమెకు లైఫ్ ఇవ్వాలని చూస్తున్నాడు. అటు త్రివిక్రమ్ కూడా గుంటూరు కారం కోసం జరిగిన పొరపాటు.. రిపిట్ అవ్వకుండా.. పూజాతో పర్ఫెక్ట్ గా సినిమా చేయాలని చూస్తున్నాడట. బన్నీ సినిమాను ఏలా తీస్తాడు ఏం చేస్తాడో చూడాలి. అటు అల్లు అర్జున్ కూడా పూజా వద్దు అని చాలా మంది చెప్పినా.. పట్టించుకోలేదట.