MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భన్సాలీతో బన్నీ భేటీ... టాలీవుడ్ పై భారీ ప్లాన్ చేసిన అల్లు అర్జున్..

భన్సాలీతో బన్నీ భేటీ... టాలీవుడ్ పై భారీ ప్లాన్ చేసిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ ఇక ఆట మొదలెట్టబోతున్నాడు. బాలీవుడ్ లో ఇప్పటికే సత్తా చాటిన బన్నీ.. ఇక గేమ్ అక్కడ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంతకీ ఐకాస్ స్టార్ ఏం చేయబోతున్నాడు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 11 2025, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఆట మొదలు పెట్టాడు. పాన్ఇండియా స్టార్ గా బన్నీ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు. పుష్ప2 సినిమాతో రికార్డ్ ల మోత మోగించేశాడు అల్లు అర్జున్. ఇక నెక్ట్స్ సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు. పుష్ప2 సినిమా తో జరిగిన రచ్చ వల్ల  ఈసినిమా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో ఈ చికాకుల నుంచి కాస్త దూరంగా ఉండటం కోసం సినిమాలకు షార్ట్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

Also Read: దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.

26

అయితే ఈ గ్యాప్ తరువాత కూడా అల్లు అర్జున్ బాలీవుడ్ ను టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. దాని కోసం ఆయన పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాడట.  రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కూడా బన్నీ కలిసినట్టు సమాచారం. గతంలో కూడా వీరు ఒక సారి కలిశారు. కాని సినిమా విషయంలో ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. 

Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?

36

పుష్ప మూవీ  రిలీజ్ తరువాత అల్లు అర్జున్ కు నార్త్ లో భారీగా క్రేజ్ ఏర్పడిననేపథ్యంలో.. అప్పట్లోనే బన్సాలీ బన్నీతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాడని సమాచారం. అయితే పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం. బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తే.. 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించడంతో.. అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియాలో  ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాకు నార్త్ నుంచే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. 

Also Read: హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...

46

రెండు తెలుగురాష్ట్రాల కంటే కూడా నార్త్ కలెక్షన్స్ ఎక్కువ. ఇప్పటికీ ఈసినిమా అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక దంగల్ కలెక్షన్స్ ను క్రాస్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు పుష్ప2 టీమ్. ఈక్రమంలో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో పెరిగిని క్రేజ్ ను క్యాచ్ చేసి.. అద్భుమైన సినిమా చేయాలని చూస్తున్నారట సంజయ్ లీలా భన్సాలీ. ఈసినిమా కోసమే అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. నార్త్ లోమరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ లలో బన్నీ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. 

56

సో ఈ దెబ్బతో బన్నీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు. భన్సాలీ బన్నీ సినిమా చేసి..అది బ్లాక్ బస్టర్ అయితే.. అల్లు అర్జున్ ను అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక పుష్ప3 విషయానికి వస్తే..  పుష్ప2 వివాదం వల్ల  పుష్ప3కి కాస్త గ్యాప్ ఇవ్వాలి అనుకున్నారు బన్నీ. అందుకే ఆ లుక్ నుంచి కూడా బయటకు వచ్చాడు. షార్ట్ హెయిర్, షార్ట్ గెడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. 
 

66

ఇక ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమాను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. త్రివిక్రమ్ సినిమా ఈ మార్చ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో బాలీవుడ్ లో బన్నీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. ఒక వేళ టాలీవుడ్ ను వదిలి.. ముంబయ్ లో సెటిల్ అయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదేమో.. బాలీవుడ్ అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అల్లు అర్జున్  కు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Recommended image3
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved