'శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నా' వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్టు
అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదల, పుష్ప 2 విజయం మరియు విషాదం గురించి మరింత తెలుసుకోండి. బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి ఆయన చేసిన ప్రకటన మరియు చిత్రం యొక్క బాక్సాఫీస్ విజయం గురించి తెలుసుకోండి.

Allu Arjun, Shritej, Pushpa 2 The Rule
పుష్ప-2 చిత్ర ప్రదర్శన సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
చంచల్‌గూడ జైలులో ఆ రాత్రంతా ఉన్న ఆయన.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. శనివారం ఉదయం 6.30కి అల్లు అర్జున్‌తోపాటు, సంధ్య థియేటర్ యజమానులు ఆగమాటి వీరారెడ్డి కుమారుడు రాంరెడ్డి, మల్లారెడ్డి కుమారుడు రాంరెడ్డిలను విడుదల చేశారు. శని, ఆదివారం అంతా కుటుంబంవారు, స్నేహితులు, స్టార్స్ వచ్చి ఆయన్ను పలకరించటంతో సరిపోయింది.
ఈ క్రమంలో కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ (Allu Arjun) తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు బన్నీ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే న్యాయవాది నిరంజన్‌రెడ్డితో చర్చించాక.. మీడియాతో మాట్లాడారు.
నేను నా కుటుంబంతో సినిమా థియేటర్‌లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. అందులో నా ప్రమేయం ఏమీ లేదు’ అని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కొందరు విలేకరులు ప్రశ్నించగా.. అది చట్టపరిధిలో ఉన్న అంశమని, దాని గురించి మాట్లాడబోనని చెప్పారు.. అర్జున్.
జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను పలువురు సినీ ప్రముఖులు పలకరించారు. నటులు ఆర్. నారాయణమూర్తి, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, సుధీర్‌బాబు, కన్నడ నటుడు ఉపేంద్ర, దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బి.గోపాల్, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, యెర్నేని నవీన్, రవి, దిల్‌రాజు, బీవీఎన్‌ఎస్ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ తదితరులు అల్లు అర్జున్‌ను పరామర్శించారు.
బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్‌తోపాటు ఇతర భాషలకి చెందిన పలువురు సినీ తారలు అర్జున్‌కి ఫోన్ చేశారు. అర్జున్ జైలు నుంచి విడుదల కావడంపై హీరో మంచు మనోజ్ ‘మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్’ అంటూ ఎక్స్ ద్వారా స్పందించారు.
మరో ప్రక్క ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) దాదాపు పది రోజుల్లోనే హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.507.50 కోట్ల (కేవలం హిందీ మార్కెట్) నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేసింది. ‘పుష్ప 2 ది రూల్’ రికార్డుల పరంపర కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేసింది.