పుష్ప 2 ప్రీమియర్ విషాదం: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించింది.
Allu Arjun
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతూ దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పుష్ప-2 ప్రీమియర్ మాత్రం ఓ విషాద ఘటనను మిగిల్చించి. డిసెంబర్ 04వ తేదీన జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఈ వ్యవహారంలో పలువురు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు పోలీసులు కూడా అటు అల్లు అర్జున్ టీమ్ మీద, సంధ్య థియేటర్ యాజమాన్యం మీద పలు కేసులు నమోదు చేశారు.
actor allu arjun
ప్రేక్షకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్య థియేటర్ మీద, థియేటర్‌కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ మీద.. చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు.
allu arjun
ఈనెల 4వ తేదీన రాత్రి పుష్ప2 మూవీ ప్రీమియర్ షో జరిగింది. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్దకు ఈ నెల నాలుగో తేదీ రాత్రి 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి, ఆయనని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు.
allu arjun
ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్లో సైతం విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.
అదే విధంగా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం ప్రకటించారు. గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అదే విధంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
Pushpa 2
మరో ప్రక్క ఇదే విషయంపై సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది. పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందని.. పైగా ప్రీమియర్ షో తాము నిర్వహించలేదని.. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినా తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామన్నారు. అలాంటి తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.