MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Allu Arjun Favorite Movie: అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? రౌడీ అల్లుడు కాదు.. ప్రతిసారి కొత్త ఫీలింగ్‌

Allu Arjun Favorite Movie: అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? రౌడీ అల్లుడు కాదు.. ప్రతిసారి కొత్త ఫీలింగ్‌

అల్లు అర్జున్‌.. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని, ఆయన సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. అయితే చిరంజీవి నటించిన చిత్రాల్లో ఒక సినిమా ఎన్నిసార్లు చూసిన కొత్త ఫీలింగ్‌ ఇస్తుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 04 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్‌
Image Credit : our own

చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. మెగాస్టార్‌ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ఎదిగారు. తనని తాను షైన్‌ చేసుకున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. `పుష్ప 2`తో ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. నెక్ట్స్ గ్లోబల్‌ ఇమేజ్‌పై, అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశారు. తన భారీ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`వితేజ`లో బాలనటుడిగా నటించిన బన్నీ
Image Credit : our own

`వితేజ`లో బాలనటుడిగా నటించిన బన్నీ

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌.. అన్నీ విషయాల్లో చిరంజీవిని ఇన్‌స్పైర్‌ అయ్యాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డాన్సులు స్వయంగా చిరంజీవినే నేర్పించారు. ఖాళీ సమయంలో చరణ్‌, బన్నీ, తేజ్‌, వరుణ్‌ ఇలా అందరితో డాన్స్ చేయించారు చిరు. ఆయా వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు `వితేజ` సినిమాలో బాలనటుడిగా బన్నీని వెండితెరకు పరిచయం చేయించారు. మరోవైపు `డాడి`లోనూ డాన్సర్‌గా చిన్న పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించిన విషయం తెలిసింది.

Related Articles

Related image1
80 Actress: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది
Related image2
Chiranjeevi: చిరంజీవి సినిమా, ముందుగానే భయపడిన పోలీసులు.. ఆడియోతోనే సౌత్ లో తిరుగులేని రికార్డ్
35
అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ `ఇంద్ర`
Image Credit : our own

అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ `ఇంద్ర`

మరి అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? స్వయంగా బన్నీనే ఈ విషయాన్ని పంచుకున్నారు. ఎన్నిసార్లు అయినా చూడదగ్గ చిత్రాల్లో చిరంజీవి నటించిన `ఇంద్ర` సినిమా అని చెప్పారు. హాలీవుడ్‌లో `టైటానిక్‌`, తెలుగులో `ఇంద్ర` సినిమా అని తెలిపారు. ఈ మూవీ ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుందని, ఏదో ఒక కొత్త ఫీలింగ్‌ని కలిగిస్తుందని చెప్పారు. ఎప్పుడూ చూసినా ఇంతకు ముందు గమనించని కొత్త విషయం కనిపిస్తుందని చెప్పారు. ఈ మూవీని ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదని ఆయన వెల్లడించారు. `రుద్రమదేవి` సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

45
రౌడీ అల్లుడుని రీమేక్‌ చేయాలనుకున్న అల్లు అర్జున్‌
Image Credit : stockPhoto

రౌడీ అల్లుడుని రీమేక్‌ చేయాలనుకున్న అల్లు అర్జున్‌

ఇక మరో సందర్బంలో చిరంజీవి నటించిన చిత్రాల్లో తనకు ఇష్టమైన మూవీ `రౌడీ అల్లుడు` అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాను రీమేక్‌ చేయాల్సి వస్తే ఈ మూవీని రీమేక్‌ చేస్తానని ఆయన తెలిపారు. ఆ సినిమాలో చిరంజీవి గారి పీక్‌ లెవల్‌ చూస్తారని, కామెడీ వేరే లెవల్‌ అని తెలిపారు. నటుడిగా ఆయన బౌండరీస్‌ బ్రేక్‌ చేసి నటించిన చిత్రం అని, అత్యధికంగా తాను చూసి మూవీ అని, అందులో చిరంజీవిగారి బాడీలాంగ్వేజ్‌ని పీక్‌లో చూస్తారని తెలిపారు. `రౌడీ అల్లుడు` తన ఫేవరేట్ మూవీ అని, రీమేక్‌ చేయాల్సి వస్తే ఈ సినిమాని రీమేక్‌ చేస్తానని తెలిపారు బన్నీ. సినిమా ప్రారంభం సీన్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌, ప్రతి డైలాగ్‌ చెప్పేయగలను అని తెలిపారు.

55
ఏఏ 22తో నటిస్తున్న బన్నీ
Image Credit : Asianet News

ఏఏ 22తో నటిస్తున్న బన్నీ

`గంగోత్రి` సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. `ఆర్య`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. హీరోగా తొలి బ్రేక్‌ అందుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `రేసుగుర్రం`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `వేదం`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. స్టార్‌గా ఎదిగారు. `పుష్ప 2` తర్వాత ఆయన రేంజ్‌ ఏంటో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన అట్లీ ద్శకత్వంలో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
80 Actress: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా, ముందుగానే భయపడిన పోలీసులు.. ఆడియోతోనే సౌత్ లో తిరుగులేని రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved