- Home
- Entertainment
- ప్లాన్ అదిరింది, ప్రభాస్ 'ఆదిపురుష్'తో అల్లు అర్జున్ 'AAA సినిమాస్' లాంచ్.. టికెట్ల కోసం అప్పుడే ట్రెండింగ్
ప్లాన్ అదిరింది, ప్రభాస్ 'ఆదిపురుష్'తో అల్లు అర్జున్ 'AAA సినిమాస్' లాంచ్.. టికెట్ల కోసం అప్పుడే ట్రెండింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి అంశంలో తన ప్రత్యేకత చూపిస్తుంటారు. తాను చేసే చిత్రాల్లో వైవిధ్యం కోరుకుంటారు. సినిమాల్లో అయినా బిజినెస్ లో అయినా అంతే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి అంశంలో తన ప్రత్యేకత చూపిస్తుంటారు. తాను చేసే చిత్రాల్లో వైవిధ్యం కోరుకుంటారు. సినిమాల్లో అయినా బిజినెస్ లో అయినా అంతే. అల్లు అర్జున్ ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో చేతులు కలిపి ఓ భారీ మల్టిఫ్లెక్స్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న చోట ఈ మల్టిఫ్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. మహేష్ బాబు ఏఎంబి సినిమా తరహాలో ఈ మల్టిఫ్లెక్స్ కి ఏషియన్ అల్లు అర్జున్ (AAA) సినిమాస్ అని నామకరణం చేశారు. ప్రేక్షకులని అబ్బుర పరిచే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో AAA సినిమాస్ రూపుదిద్దుకుంటోంది. తాజాగా AAA సినిమాస్ నిర్మాణం పూర్తయింది. దీనితో ప్రారంభోత్సవానికి సరైన టైం కోసం ఎదురుచూశారు.
త్వరలో ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ రిలీజ్ కానుంది. జూన్ 16న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ AAA సినిమాస్ ఓపెనింగ్ కి ఇంతకు మించిన తరుణం ఉండదు అనే చెప్పాలి. దీనితో AAA సినిమాస్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖరారు చేశారు. ఇది భారీ పాన్ ఇండియా చిత్రం మాత్రమే కాక రామాయణం గాథతో తెరకెక్కుతుండడంతో ప్రారంభోత్సవానికి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని యాజమాన్యం భావిస్తోంది.
జూన్ 15న AAA సినిమాస్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఆ మరుసటి రోజు అంటే 16 నుంచి ఈ మల్టిఫ్లెక్స్ లో తొలి చిత్ర ప్రదర్శన ఆదిపురుష్ తో మొదలవుతుంది. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సినిమా ప్రదర్శనలు మాత్రమే కాదు.. ఇక్కడ చిన్నపాటి సినిమా ఈవెంట్స్ కూడా జరగడం చూస్తున్నాం.
భవిష్యత్తులో అల్లు అర్జున్ AAA సినిమాస్ లో కూడా అదే తరహా సందడి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే AAA సినిమాస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లోపల ఎంత అబ్బుర పరిచే విధంగా ఉంటుందో మరి.
ఇక నూతనంగా ప్రారంభం అవుతున్న AAA సినిమాస్ లో ఆదిపురుష్ చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. AAA సినిమాస్ లో ఆదిపురుష్ టికెట్స్ కావాలంటూ ఫ్యాన్స్ ట్రెండింగ్ కూడా మొదలు పెట్టేశారు.