అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రతిభకి కారణం చిరంజీవి కాదా ?..మరో బాంబు పేల్చి దుమారం రేపిన అల్లు అరవింద్
Allu Aravind comments on Allu Arjun Dance: అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎవరు ఎంతలా డ్యాన్స్ చేసినా చిరంజీవిలా గ్రేస్ తో డ్యాన్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని చాలా మంది చెబుతుంటారు.

Allu Aravind, Chiranjeevi
మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ శత్రువుల తరహాలో యుద్ధం చేసుకుంటున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతున్నట్లు కొన్ని సంకేతాలు కనిపిస్తుండడంతో ఈ అనుమానాలు ఎక్కువవుతున్నాయి. దీనితో మెగా, అల్లు ఫ్యామిలీల గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun
తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎవరు ఎంతలా డ్యాన్స్ చేసినా చిరంజీవిలా గ్రేస్ తో డ్యాన్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని చాలా మంది చెబుతుంటారు. చిరంజీవి అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో ఆ ఫ్యామిలీలో రాంచరణ్, అల్లు అర్జున్ లకు కూడా డ్యాన్స్ ప్రతిభ వచ్చింది అని చాలా మంది భావిస్తుంటారు.
allu aravind
కానీ అల్లు అరవింద్ మాత్రం తాజాగా తండేల్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదికపై డ్యాన్స్ చేయాలని యాంకర్ కోరగా నాకు డ్యాన్స్ రాదు.. ఏదైనా మంచి మ్యూజిక్ వినపడితే కాలు కడుపుతాను తప్ప నాకు డ్యాన్స్ రాదు. మా అబ్బాయి అల్లు అర్జున్ వచ్చిన డ్యాన్స్ నాది కాదు.. వాళ్ళ అమ్మ నుంచి బన్నీకి డ్యాన్స్ వచ్చింది. వాళ్ళ అమ్మ మంచి డ్యాన్సర్ అని అల్లు అరవింద్ తెలిపారు.
megastar chiranjeevi
అంటే అల్లు అర్జున్ డ్యాన్స్ వెనుక చిరంజీవి ప్రమేయం ఏమీలేదా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చిరంజీవి వల్ల అల్లు అర్జున్ డ్యాన్స్ రాలేదు అనే విషయాన్ని అల్లు అరవింద్ పరోక్షంగా చెప్పదలుచుకున్నారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా అల్లు అరవింద్ మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు.

