MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రశాంత్‌ నీల్‌తో రామ్‌ చరణ్‌ సినిమా.. ఆనంద పడలా, బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.. నిరాశ పరిచే అంశమిదే!

ప్రశాంత్‌ నీల్‌తో రామ్‌ చరణ్‌ సినిమా.. ఆనంద పడలా, బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.. నిరాశ పరిచే అంశమిదే!

 రామ్‌ చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్‌ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తుంది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 20 2024, 12:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. భారీ సినిమాల లైనప్‌తో దూసుకుపోతున్నాడు. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన భారీ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్‌ చరణ్‌. భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ మూవీ కోసమే మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. చరణ్‌ సోలో హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్‌ `దేవర`తో హిట్‌ కొట్టడంతో ఆ ఒత్తిడి చరణ్‌పై కూడా ఉందని చెప్పొచ్చు. మరి శంకర్‌ ఏం చేయబోతున్నాడో చూడాలి. 

 బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇదిలా ఉంటే ఇటీవల చరణ్‌.. `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందని టాక్‌. ఇద్దరి కమిట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నారట. ప్రశాంత్‌ నీల్‌ మార్క్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గానే ఈ సినిమా ఉంటుందని సమాచారం.

అయితే ప్రస్తుతం సౌత్‌ ఇండియాలోనే అత్యంత క్రేజీ దర్శకుల్లో ప్రశాంత్‌ నీల్‌ ఒకరు. రాజమౌళి, ప్రశాంత్‌ నీల్, సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌, లొకేషన్‌ కనగరాజ్‌ వంటి దర్శకులు తమ రేంజ్‌ని పెంచేశారు. అదే సమయంలో సినిమా స్టాండర్డ్స్ కూడా పెంచేశారు. వీరితో సినిమాలంటే వాటిపై హైప్‌ ఓ రేంజ్‌ లో ఉంటుంది. 

35

అందులో భాగంగానే ప్రశాంత్‌ నీల్‌తో  రామ్‌ చరణ్‌ సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇది మెగా ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించే విషయమనే చెప్పాలి. రామ్‌ చరణ్‌ లాంటి మాస్‌ హీరోకి, నీల్‌ పడితే ఆ మూవీ రేంజ్‌ పెరుగుతుంది. అదే సమయంలో హీరోగా రామ్‌ చరణ్‌ స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతాయి.

అందుకే ఈ కాంబో విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా త్వరగా సెట్‌ కావాలని భావిస్తున్నారు. కొందరు ఏకంగా పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. బాగా డిజప్పాయింట్‌ అయ్యే అంశముంది. అదేంటనేది చూస్తే. 
 

45

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీని తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో భారీ యాక్షన్‌ మూవీ చేయనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. అనంతరం రామ్‌ చరణ్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. బుచ్చిబాబు మూవీ కంప్లీట్‌ అయ్యాక సుకుమార్‌ సినిమాని పట్టాలెక్కించనున్నారు. వీటి తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్టార్ట్ కానుందని సమాచారం. 
 

55

మరోవైపు ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్‌ మూవీగా ఇది ఉండబోతుంది. తన ప్రశాంత్‌ నీల్‌ యూనివర్స్ లో భాగంగానే ఎన్టీఆర్‌ మూవీ ఉండబోతుందట. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ కానుంది. ఈ సినిమా కంప్లీట్‌ అయ్యాక ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌తో `సలార్‌ 2` చేయాల్సి ఉంది.

దీనికి సంబంధించిన కొంత షూటింగ్‌ ఫూటేజీ కూడా ఉంది. దాదాపు 30, 40 శాతం సినిమా కంప్లీట్‌ అయ్యిందని తెలుస్తుంది. అనంతరం `కేజీఎఫ్‌ 3` సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తి చేసుకుని రామ్‌ చరణ్‌ సినిమాపైకి వెళ్లనున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఇటు రామ్‌ చరణ్‌ కమిట్‌ మెంట్స్, అటు ప్రశాంత్‌ నీల్‌ కమిట్‌ మెంట్స్ పూర్తి కావడానికి ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది.

అంటే రామ్‌ చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా పట్టాలెక్కడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పొచ్చు. అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ అదే కమిట్‌మెంట్‌తో ఉంటుందా? అనేది సస్పెన్స్. ఇదే మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసే అంశం. రామ్‌ చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తతో సంతోషించాలా? ఇది మరో మూడేళ్ల తర్వాత ఉంటుందనే వార్తకి బాధపడాలో అర్థం కాని పరిస్థితి వారి ఫ్యాన్స్ ది కావడం గమనార్హం. 

Read more: నాగార్జునకి బాలకృష్ణ తమ్ముడిగా మారిన సందర్భం, బాబాయ్‌గా నీకు నేనున్నా అంటూ నాగచైతన్యకి భరోసా!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved