- Home
- Entertainment
- మహేష్ బాబు, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మిస్ అయిన మల్టీస్టారర్ ఏంటో తెలుసా? వర్క్ అయితే ఊహించడం కష్టమే
మహేష్ బాబు, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మిస్ అయిన మల్టీస్టారర్ ఏంటో తెలుసా? వర్క్ అయితే ఊహించడం కష్టమే
మహేష్ బాబు ఇప్పటి వరకు ఒకే మూవీ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు`లో నటించాడు. కానీ హృతిక్ రోషన్‌తో కలిసి చేయాల్సిన మరో మూవీ మిస్ అయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us

రాజమౌళితో సినిమాలో బిజీగా ఉన్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతుంది. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది.
ఇందులో మహేష్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.
మహేష్, హృతిక్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్
ఈ మూవీ కంటే ముందే మహేష్ ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మిస్ చేసుకున్నారు. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తో కలిసి నటించే ఆఫర్‌ని తిరస్కరించారు.
కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ అంటే అది ఊహకు కూడా అందదు. ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ కలిసి `వార్ 2`లో నటిస్తున్నారు. దీనిపైనే భారీ హైప్ ఉంది.
త్వరలో రాబోతున్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది. అదే మహేష్, హృతిక్ కాంబినేషన్‌లో మూవీ అంటే దాని రేంజ్ వేరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ మూవీ మిస్ అయ్యింది.
రణ్‌బీర్, యష్‌లతో `రామాయణ్`
మహేష్, హృతిక్ కాంబినేషన్‌లో మిస్ అయిన మూవీ ఏంటో కాదు `రామాయణ్`. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రమిది.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు.
ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.
`రామాయణ్`లో మహేష్, హృతిక్ ఫస్ట్ ఛాయిస్
`రామాయణ్`ని మొదట అనుకున్నది మహేష్ బాబుతోనే. ఆయన్ని రాముడిగా నటింపచేయాలనుకున్నారు. రావణుడిగా హృతిక్ రోషన్‌ని అనుకున్నారు. వారిని అప్రోచ్ అయ్యారు.
కానీ ఈ ఇద్దరూ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దీంతో ఆ స్థానంలో రణ్ బీర్ కపూర్, యష్ వచ్చారు. ఇప్పుడు ఈ చిత్రానికి వీరిద్దరు పర్‌ఫెక్ట్ కాస్టింగ్ అని అంతా అభిప్రాయపడుతున్నారు.
మహేష్, హృతిక్ రాంగ్ కాస్టింగ్ అనే కామెంట్ వినిపిస్తుంది. కానీ పర్‌ఫెక్ట్ గా ప్లాన్ చేసి, బాగా వచ్చేలా వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ తీస్తే దీన్ని మించింది మరోటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
రాజమౌళి మూవీతో మహేష్, `వార్ 2`తో హృతిక్ బిజీ
ఇక మహేష్..రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మూవీ వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు షూటింగ్ అయితే వచ్చే ఏడాది వస్తుంది, లేదంటే 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన `వార్ 2` మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో ఉంది. వీరిద్దరిపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ మూవీని నిర్మాత నాగవంశీ విడుదల చేస్తున్నారు.