MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కామెడీ సినిమాలే నన్ను ముంచేశాయ్.. అల్లరి నరేష్ కీలక వ్యాఖ్యలు..

కామెడీ సినిమాలే నన్ను ముంచేశాయ్.. అల్లరి నరేష్ కీలక వ్యాఖ్యలు..

Allari Naresh: నటుడు అల్లరి నరేష్ తన కెరీర్ ఒడిదుడుకులపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2012 వరకు విజయం, ఆపై వరుస ఫ్లాప్‌లు, నాందితో తన కెరీర్‌కు వచ్చిన మలుపు గురించి వివరించారు.

2 Min read
Author : Pavithra D
Published : Nov 24 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కామెడీ సినిమాలు ముంచేశాయ్..
Image Credit : Asianet News

కామెడీ సినిమాలు ముంచేశాయ్..

ప్రముఖ నటుడు అల్లరి నరేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఒడిదుడుకులు, భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నారు. 2012 వరకు తన చిత్రాలకు మంచి ఆదరణ లభించిందని, ఆడియన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టిన రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే, 2013 నుంచి 2019 వరకు వరుసగా పరాజయాలను చవిచూశానని అంగీకరించారు. ఆ సమయంలో గమ్యం లేదా శంభో శివ శంభో వంటి చిత్రాలకు మంచి పేరు వచ్చినప్పుడే కామెడీ జానర్ నుంచి బయటపడి వేరే కథలను ఎంచుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరు నుంచి ఎనిమిది నెలల విరామం..
Image Credit : our own

ఆరు నుంచి ఎనిమిది నెలల విరామం..

మహర్షి చిత్రం తర్వాత సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు విరామం తీసుకున్నానని, ఆ సమయంలో తనకు వ్యక్తిగతంగా నచ్చిన, రెగ్యులర్‌కు భిన్నమైన కథలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నాంది చిత్రం తన కెరీర్‌లో ఒక ప్రూవింగ్ పాయింట్ అని నరేష్ పేర్కొన్నారు. కామెడీ చేసే నటుడు సీరియస్ సినిమా చేస్తే బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్లు కొంటారా, జనాలు థియేటర్‌కు వస్తారా అనే అనేక ప్రశ్నలకు నాంది సమాధానం ఇచ్చిందని వివరించారు.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
కంటెంట్ బాగుంటే ఏ పాత్రలోనైనా..
Image Credit : our own

కంటెంట్ బాగుంటే ఏ పాత్రలోనైనా..

ఆ చిత్రం విజయం సాధించాక, కంటెంట్ బాగుంటే తనను ఏ పాత్రలోనైనా చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని అర్థమైందని, అప్పటి నుంచి తాను చాలా సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటున్నానని అల్లరి నరేష్ చెప్పారు. నరేష్ తన కొత్త చిత్రం 12A రైల్వే కాలనీ గురించి మాట్లాడుతూ, ఇది తన మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ అని వెల్లడించారు. నాంది తర్వాత నటుడిగా కొత్త పాత్రలను ఎంచుకోవాలనే తపన తనకు ఉందని, అందులో భాగంగానే సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఆసక్తి పెరిగిందని అన్నారు.

45
కథలో ఎన్నో మల్టీ-లేయర్‌లు..
Image Credit : our own

కథలో ఎన్నో మల్టీ-లేయర్‌లు..

పొలిమేర దర్శకుడు అనిల్ ఒకరోజు ఈ కథను చెప్పగా, తాను ఎంతో ఉత్సాహం చూపించానని తెలిపారు. ఈ కథలో అనేక మల్టీ-లేయర్‌లు ఉన్నాయని, ఏ కథ ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుందో అర్థం కాని పజిల్ లా ఉంటుందని వివరించారు. సినిమాలో ప్రతి పాత్రపైనా, తన పాత్రపైనా కూడా అనుమానం వస్తుందని అన్నారు. దర్శకుడు అనిల్ స్క్రీన్‌ప్లే తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

55
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో..
Image Credit : our own

ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో..

మహారాజా లాంటి చిత్రం మాదిరిగా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో ఉంటుందని నరేష్ చెప్పారు. ఈ చిత్రంలో తాను కామెడీ కాకుండా, లోకల్ పొలిటీషియన్ కు రైట్ హ్యాండ్‌గా ఉండే పాత్రలో ఎనర్జీని చూపిస్తానని, ఆ యాక్టివ్ పాత్ర ఎలా సీరియస్ పర్సన్‌గా మారుతుందనేదే 12A రైల్వే కాలనీ కథ అని నరేష్ వివరించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved