- Home
- Entertainment
- ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్, వేల కోట్ల మూవీ పక్కన పెట్టి హీరోయిన్ వెంటపడుతున్న పాన్ ఇండియా డైరెక్టర్
ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్, వేల కోట్ల మూవీ పక్కన పెట్టి హీరోయిన్ వెంటపడుతున్న పాన్ ఇండియా డైరెక్టర్
బాలీవుడ్ స్టార్స్ కి కూడా అందనంత ఎత్తు ఎదిగిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా ఈ ఏడాదే ప్రారంభం కాబోతోంది.

Nag Ashwin, Prabhas
బాలీవుడ్ స్టార్స్ కి కూడా అందనంత ఎత్తు ఎదిగిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా ఈ ఏడాదే ప్రారంభం కాబోతోంది. అంటే రెండేళ్ల వరకు ప్రభాస్ కాల్ షీట్లు ఖాళీగా ఉండే అవకాశం లేదు.
Director Nag Ashwin
మరోవైపు కల్కి 2, సలార్ 2 సీక్వెల్స్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. వీటి పరిస్థితి ఏంటో ఇప్పుడే తేలదు. అయితే ఓ పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రం ప్రభాస్ అభిమానులకు షాకిచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు కల్కి 2 చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కల్కి 2లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు ? డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ని పూర్తి స్థాయిలో కర్ణుడిగా చూపిస్తాడా ? ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఫ్యాన్స్ కల్కి 2 కోసం ఎదురు చూస్తున్నారు. ల్కి మొదటి భాగం పాన్ ఇండియా వైడ్ గా 1100 కోట్లు రాబట్టింది. కల్కి 2 ఇంకా భారీగా ఉండబోతోంది.
Alia Bhatt
అయితే తాను కల్కి 2 పూర్తి చేసే వరకు మరో ప్రాజెక్ట్ చేపట్టనని నాగ్ అశ్విన్ గతంలో తెలిపారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం కల్కి 2 కాదు. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా నాగ్ అశ్విన్ తాత్కాలికంగా కల్కి 2 చిత్రాన్ని పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. క
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన క్రేజీ హీరోయిన్ అలియా భట్ తో నాగ్ అశ్విన్ ఒక చిత్రం చేయబోతున్నట్లు బి టౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ నాగ్ అశ్విన్.. అలియా భట్ ని కలసి స్టోరీ ఐడియా చెప్పారట. అలియా భట్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ పలుమార్లు అలియాని కలసి చర్చలు జరిపారు. బడ్జెట్ కి సంబంధించిన లెక్కలు తేలితే ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అవుతుందని అంటున్నారు.