- Home
- Entertainment
- Alia Bhatt : వైట్ శారీలో అలియా భట్ స్టన్నింగ్ లుక్స్ .. చీరకట్టులో మెరిసిపోతున్న ‘గంగూబాయి’
Alia Bhatt : వైట్ శారీలో అలియా భట్ స్టన్నింగ్ లుక్స్ .. చీరకట్టులో మెరిసిపోతున్న ‘గంగూబాయి’
ఆర్ఆర్ఆర్ (RRR) హీరోయిన్ అలియా భట్ వైట్ శారీలో దర్శనమిచ్చి అభిమానులను మైమరిపిస్తోంది. గుచ్చె చూపులతో.. ఆకర్షించే అందంతో నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ‘గంగూబాయి కతియా వాడి’ కోసం ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) తాజాగా నటించిన హిందీ చిత్రం గంగూబాయి కతియా వాడి (Gangubai Kathiawadi). ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయినా విడుదల అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యింది.
కరోనా రెండో దశ పరిస్థితుల కారణంగా మూవీని వాయిదా వేస్తూ వచ్చారు. తొలుత గతేడాది జూలై 30న రిలీజ్ కావాల్సిన మూవీ.. కరోనా కేసులను పరిగనలోకి తీసుకొని మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్ట కేళలకు ఈ మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో ఆడనుంది.
కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడుతోంది. ఇటీవల జర్మనీలో నిర్వహించిన 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గంగూబాయి కతియా వాడి మూడీ ప్రీమియర్ షో కూడా ముగిసింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. అలియా గంగూబాయి స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' మూవీ ప్రమోషన్ కోసం కోల్‌కతాకు వెళ్లింది. 'సిటీ ఆఫ్ జాయ్' నుండి వరుస ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఫొటోల్లో అలియా నెక్‌లైన్‌తో కూడిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో తెల్లటి చీర ధరించి మెస్మరైజ్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఈయర్ రింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. మత్తెక్కించే చూపులతో అలియా గంగూబాయి హవాను కొనసాగిస్తోంది.
ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ అలియా క్యాప్షన్ కూడా ఇచ్చింది. గంగూబాయి కతియావాడి నుంచి నిన్న రిలీజైన ‘మేరీజాన్’ సాంగ్ ను గుర్తు చేస్తూ ‘కోల్ కతా మేరీజాన్’ అంటూ క్యాప్షన్ గా పెట్టింది. ఈ ఫొటోలను చూసిన బాలీవుడ్ తారలు అతియా శెట్టి మరియు సోనీ రజ్దాన్ ‘సన్నింగ్’ అంటూ కామెంట్లు చేశారు.