- Home
- Entertainment
- Alia Bhatt Latest Photos : సిల్వర్ శారీలో బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న అలియా భట్.. లేటెస్ట్ పిక్స్
Alia Bhatt Latest Photos : సిల్వర్ శారీలో బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న అలియా భట్.. లేటెస్ట్ పిక్స్
గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi) మూవీతో మంచి జోష్ లో ఉన్న అలియా భట్.. సోషల్ మీడియాలోనూ తన బ్యూటీతో మెస్మరైజ్ చేస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌస్ లో బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. అలియా తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) నటించిన తాజాగా ‘గంగూబాయి కతియావాడి’తో హిందీ ప్రేక్షకులతో పాటు.. తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తోంది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్పప్పటికీ విభిన్న పాత్రలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు వేయించుకుంది..
ముంబాయి మాఫియా క్వీన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) కీలక పాత్రలో నటించారు. హిందీతో పాటు తెలుగులోనూ డబ్ వెర్షన్ లో గత నెల 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కువ మొత్తంలో పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో గంగూబాయి కతియావాడి మూవీ 100 కోట్ల కలెక్షన్స్ సాధించే దిశగా పరుగులు పెడుతోంది. వీకెండ్స్ లో గంగూబాయి హవా చూపిస్తోంది. వాలిమై, భీమ్లా నాయక్ సినిమాలకు ధీటుగా గంగూబాయి కలెక్షన్స్ లో జోరుచూపిస్తోంది.
అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు అలియా భట్.. ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంది. అటు జర్మనీలో బెల్లిన్ 76వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ అందరి మన్ననలు పొందింది. సోషల్ మీడియాలో అలియా లేటెస్ట్ ఫొటోషూట్లతో ఒక రేంజ్ లో తన మూవీ ప్రమోషన్స్ ను చేసుకుంది.
గంగూబాయి కతియావాడి వైబ్స్ నే మెయిన్ టేయిన్ చేస్తున్న ఈ బ్యూటీ ఇన్ స్టాలో తాజా ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. చీరకట్టుతో నెటిజన్లకు పిచ్చేక్కిస్తోంది. తన గ్లామర్ కు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలియా పోస్ట్ చేసిన ఫొటోల్లో చాలా ఆకర్షణీయంగా ఉంది. సిల్వర్ శారీలో పిచ్చెక్కిస్తోంది. స్లీవ్ లెస్ బ్లాజ్ ధరించి.. బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఫొటోలను చూసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఖుషీ అవుతున్నారు. అలియా బ్యూటీని లైక్ లు, కామెంట్లతో పొగుడుతున్నారు. ఏదేమైనా నెటిజన్లను తన వైపు తిప్పుకోవడంలో అలియా భట్ స్టైలే వేరు అని చెప్పొచ్చు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అలియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.