Alia, Ranbir Marriage: ఆలియాభట్-రణ్ భీర్ పెళ్ళిపై గందరగోళం, డేట్ ఫిక్స్ అయ్యిందా...? మళ్లీ వాయిదా పడిందా..?
ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది బాలీవుడ్ లవ్ కపుల్ రణ్ భీర్,ఆలియా పెళ్లి. కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన వీరి వివాహ వేడుక, ఈనెలలో జరుగబోతోంది. అయితే వీరి పెళ్ళి డేట్ పై మాత్రం పెద్ద కన్ ఫ్యూజన్ ఏర్పడింది.
బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హ్యాడ్ సమ్ యంగ్ స్టార్ రణ్ బీర్ కపూర్ ఒక ఇంటివారు కాబోతున్నారు. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈజంట పెళ్ళి బంధంతో ఒకటి కాబోతున్నారు.
అయితే వీరి పెళ్లి జరిగేది ఈనెలలోనే కాని ఏ డేట్ లో జరగబోతోంది అన్న విషయంలో పెద్ద కన్ ఫ్యూజన్ ఏర్పడింది. మరో వాదన ఏంటీ అంటే ఈ పెళ్లి మరోసారి వాయిదా పడబోతోంది అని. ఇలా రకరకాల వార్తలతో బాలీవుడ్ ఆడియన్స్ పెద్ద కన్ ఫ్యూజన్ లో పడ్డారు.
చాలా సీక్రేట్ గా పెళ్లి చేసుకుందా అనుకున్నారు ఆలియా భట్, రణ్ బీర్ లు. ఆ మధ్య కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారు. కాని ఆలియా రణ్ భీర్ పెళ్లి గురించి పెద్ద ప్రచారం జరిగింది. పెళ్లి వివరాలతో పాటు..పెళ్లి డేట్, పెళ్ళి పనులకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి.
ముందుగా వీరి పెళ్ళి ఈనెల 13 కాని, 14 కాని అనుకున్నారు. ఇప్పుడు భద్రతా కారణాల వల్ల ఈ తేదీలు మార్చే అవకాశం ఉంది అని ఆలియా భట్ తరపు బంధువుల నుంచి సమాచారం. ఈనెల 20 లోపు పెళ్లి జరగడం మాత్రం కన్ ఫార్మ్ అంటున్నారు.
కాని రణ్ భీర్ తరుపు నుంచి చూస్తే.. రణ్ భీర్, ఆలియా జాతకం ప్రకారం నీతూ కపూర్ ఈ డేట్ ను ఫిక్స్ చేయించారని. కపూర్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక ను ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి ఈ డేట్ ఛేంజ్ అనేది నిజమేనా.. లేకుండా సీక్రేట్ గా 14నే పెళ్ళి చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం గురించి రణ్ భీర్ కపూర్ మాతృ మూర్తి నీతూ కపూర్ తో.. ఆలియా తండ్రి మహేష్ భట్ స్యయంగా వెళ్ళి చర్చించినట్టు సమాచారం. ఏది ఏమైనా వీళ్ళిద్దరి పెళ్లి ఈనెలలో జరగడం ఖాయం. కాని అది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా కన్ ఫ్యూజన్ లోనే ఉంది. వీరి పెళ్ళి వేడుక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లు పెళ్ళి ఎప్పుడు జరిగినా.. పకడ్బందీగా ఏర్పాట్లు మాత్రం చేసుకుంటున్నారు. మీడియాకు చిన్న ఫోటో కూడా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేస్తే తప్పించి.. మరే వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారట సెలబ్రిటీలు.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లు వాళ్ళ వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి కోసం సినమా షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. ఆక రణ్ భీర్,ఆలియా జంటగా నటించిన బ్రహ్మస్త్రం మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.