- Home
- Entertainment
- Kriti Sanon Latest Photos: కృతి సనన్ ను అక్షయ్ కుమార్ ఇలా పిలిచాడంటా.. లేటెస్ట్ పిక్స్ లైక్ చేసిన టైగర్ ష్రాఫ్
Kriti Sanon Latest Photos: కృతి సనన్ ను అక్షయ్ కుమార్ ఇలా పిలిచాడంటా.. లేటెస్ట్ పిక్స్ లైక్ చేసిన టైగర్ ష్రాఫ్
లెదర్ అవుట్ ఫిట్ లో కృతి సనన్ గ్లామర్ షో మామూలుగా లేదు. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్లను హంటింగ్ చేస్తోంది. అయితే ఈ అవుట్ ఫిట్ ఫొటోలను చూసిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తనను ఏమని పిలిచాడో చెప్పింది.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ట్రెండీ వేర్ లో మతిపోగొడుతోంది. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకుంటోంది. తన గ్లామర్ కు నెటిజన్లే కాకుండా ఏకంగా బాలీవుడ్ హీరోలు కూడా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన జీవితంలోని ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటుంది. ఢిపరెంట్ అవుట్ ఫిట్ లలో ఫొటోషూట్లుు చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది కృతి సనన్. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది.
ఫాక్స్ లెదర్ అవుట్ ఫిట్ లో కృతి సనన్ గ్లామర్ షో మామూలుగా లేదు. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్లను హంటింగ్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లను మైమరిపిస్తోంది. హాఫ్ షోల్డర్ అందాలతో మతిపోగొడుతోంది. ఈ ట్రెండీలో ఆకర్షిస్తున్న కృతి సనన్ తన క్రేజ్ పెంచుకుంటోంది.
అయితే లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫొటోలను చూసిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తనను ‘హంటర్ వాలీ’ అని పిలిచినట్టు తెలిపింది. దీంతో ఆమెకు పట్టలేనంత ఆనందం కలిగిందని క్యాప్షన్ లో పేర్కొంది.
హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’ (Bachchhan Paandey)లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన క్రుతి సనన్ నటిస్తోంది. ఈ మూవీకి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియా ద్వాలా నిర్మాతగా వ్యవహరించారు. ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో అక్షయ్ కుమార్, కృతి సనన్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి కూడా నటించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘వన్ నేనొక్కడినే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కృతి సనన్ కు ఇక్కడ అంతగా గుర్తింపు రాలేదు. కానీ వరుస హిందీ చిత్రాల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది. ‘బచ్చన్ పాండే తో పాటు, బేడియా, గణపత్, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.