- Home
- Entertainment
- నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?
నాగార్జున నటనపై తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు సెటైర్లు వేశారట. ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏఎన్నార్ ఏమన్నారు ? దానికి నాగార్జున రియాక్షన్ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

నాగార్జున సినిమాలు
ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అభిమానులకు మన్మథుడిగా, కింగ్ గా మారిపోయారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. రొమాంటిక్ సినిమాలు, ప్రేమ కథలు, మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా భక్తి రస చిత్రాల్లో కూడా నాగార్జున నటించారు.
నాగార్జున తొలి చిత్రం
నాగార్జున 1986లో విక్రమ్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. నాగార్జున తొలి చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించారు. మధుసూధనరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు.
విక్రమ్ మూవీ హిట్ కానీ
సినిమా హిట్ అయింది కానీ నాగార్జున నటనకు అంత మంచి గుర్తింపు రాలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఏఎన్నార్ గారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ? మీ నటన గురించి ఆయన ఏమన్నారు అనే ప్రశ్న నాగార్జునకి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. నాగార్జున సమాధానం ఇస్తూ.. నాన్నగారు నన్ను ప్రశంసించలేదు. చాలా తెలివిగా సెటైరికల్ గా నా నటన గురించి మాట్లాడారు.
నాగార్జున నటనపై ఏఎన్నార్ సెటైర్
నాన్నగారు నాతో మాట్లాడుతూ.. పర్వాలేదురా.. నా ఫస్ట్ సినిమాలో నేను నటించిన దానికంటే బాగానే చేశావ్ అని అన్నారు. ఆయన చెప్పినదాంట్లో చాలా సెటైర్ ఉంది. అది నాకు అర్థం అయింది. తిట్టకుండా అలా తెలివిగా చెప్పారు.
పదేళ్ల తర్వాత నాగార్జున ఏం చేశారో తెలుసా
విక్రమ్ రిలీజ్ అయిన దాదాపు పదేళ్ల తర్వాత నాన్నగారు నా నటనని పూర్తి స్థాయిలో మెచ్చుకున్నారు. అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యాక నాన్నగారు పూర్తి ఓపెన్ అయి నాపై ప్రశంసలు కురిపించారు. నటుడిగా పరిపక్వత సాధించావు అని చెప్పినట్లు నాగార్జున గుర్తు చేసుకున్నారు.

