- Home
- Entertainment
- రాంచరణ్ సినిమా కథ చెప్పకుండా దేవిశ్రీని దుబాయ్ లో వదిలేసి వెళ్ళిపోయిన సుకుమార్..అద్భుతం జరిగింది తెలుసా ?
రాంచరణ్ సినిమా కథ చెప్పకుండా దేవిశ్రీని దుబాయ్ లో వదిలేసి వెళ్ళిపోయిన సుకుమార్..అద్భుతం జరిగింది తెలుసా ?
రాంచరణ్ సినిమా కోసం సుకుమార్ దేవిశ్రీ, చంద్రబోస్ లని దుబాయ్ తీసుకుని వెళ్లారు. కానీ మధ్యలోనే సుకుమార్ వచేశారట. సుకుమార్ ఎందుకు అలా చేశారు ? ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

సుకుమార్ సినిమా అంటే అది ఫిక్స్
సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని ఫిక్స్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అదే విధంగా సుకుమార్ సినిమా అంటే పాటల రచయితగా ఎక్కువగా చంద్రబోస్ ఉంటారు. చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగస్థలం సినిమాకి సంబంధించిన విశేషాలని చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు.
దుబాయ్ తీసుకుని వెళ్లి..
రంగస్థలం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం సుకుమార్.. దేవిశ్రీ, చంద్రబోస్ లని దుబాయ్ తీసుకుని వెళ్లారట. హోటల్ లో రంగస్థలం కథని సుకుమార్ కొద్దిగా మాత్రమే రివీల్ చేశారట. కథ కొద్దిగా మాత్రమే చెప్పి పాటలు రాయమని అడిగారు. కథ కొద్దిగా చెప్పి, సందర్భాలు చెప్పి పాటలు రాయమంటే కష్టం. కానీ సుకుమార్ సినిమా అంటే అది తప్పదు అని చంద్రబోస్ అన్నారు.
సుకుమార్ వెళ్లిపోయారు
సుకుమార్ చెప్పిన కొంచెం కథనే నేను, దేవిశ్రీ చాలా జాగ్రత్తగా విన్నాం. ఈ కథలో చాలా డెప్త్ ఉందని అర్థమైంది. సుకుమార్ తనకి బ్యాక్ పెయిన్ ఉండడంతో ఇండియా తిరిగి వెళ్లిపోయారు. నేను, దేవిశ్రీ దుబాయ్ లోనే 2 రోజుల పాటు హోటల్ లో ఉన్నాం. వచ్చినదానికి ఒక పాట అయినా పూర్తి చేద్దాం అని అనుకున్నాం. చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు చనిపోయే సందర్భం ఉంది. ముందు ఆ పాట చేయాలని అనుకున్నాం.
మొదట రాసింది ఆ పాటే
హోటల్ లోనే నేను పాటని దేవిశ్రీకి చెప్పాను. వెంటనే దేవిశ్రీ ట్యూన్ చేశారు. ఆ తర్వాత ఇండియా వెళ్లి మిగిలిన పాటలన్నీ పూర్తి చేశాం. అన్ని పాటలు ఒకే అయ్యాయి కానీ.. కుమార్ బాబు చనిపోయినప్పుడు వచ్చే ఓరయ్యో అనే పాటని మాత్రం సుకుమార్ ఒకే చేయలేదు.
ఎవ్వరికీ ఏడుపు రాలేదు
చివరికి షూటింగ్ కూడా వచ్చేసింది. అయినా సుకుమార్ ఆ పాటని ఒకే చేయలేదు. దీనితో షూటింగ్ కోసం పాత సెంటిమెంట్ పాటలని పెట్టి ట్రై చేశారు. ఆ సాంగ్ లో నటీనటులంతా ఏడవాలి. కానీ ఎవ్వరికీ ఏడుపు రావడం లేదు. పాత పాటలు కాబట్టి నేచురల్ గా ఏడుపు రావడం లేదు. ఇక చేసేది లేక చంద్రబోస్, దేవిశ్రీ రెడీ చేసిన ఓరయ్యో అనే సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ లో ఉండే ఎమోషన్ వల్ల నటీనటులందరికీ సహజంగానే ఏడుపు వచ్చేసింది. అప్పుడు సుకుమార్ ఈ సాంగ్ ని ఫైనల్ చేశారు అని చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు.

