- Home
- Entertainment
- నాగార్జున ఫిట్ నెస్ రహస్యం.. 35 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? రాత్రికి మాత్రం పక్కా!
నాగార్జున ఫిట్ నెస్ రహస్యం.. 35 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? రాత్రికి మాత్రం పక్కా!
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అనగానే మన అందరికీ బాగా గుర్తుకు వచ్చేది ఫిట్ నెస్. 64 ఏళ్లలోనూ కింగ్ ఇంకా యంగ్ గానే కనిపించడానికి చాలా పెద్ద కథనే ఉంది. అదేంటో తెలుసుకుందాం.

కింగ్, అక్కినేని నాగార్జున గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రంతో అలరించారు.
అయితే, ఇప్పటికీ నాగార్జున వెండితెరపై యంగ్ గానే కనిపిస్తుండటం విశేషం. 64 ఏళ్ల వయస్సులోనూ ఎలా ఫిట్ గా, యంగ్ గా కనిపిస్తున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. అందుకు ఆయన ఏం చేస్తారనేది తెలుసుకుందాం.
ఫిట్ నెస్ పై నాగార్జున చాలా సందర్భాల్లో మాట్లాడారు. తనకు రోజులో కలిసి వారికీ ఫిట్ నెస్ పాఠాలు చెబుతుంటారాయన. ఫిట్ గా ఉండాలంటూ మోటీవేట్ చేస్తారని పూరీ జగన్నాథ్ ఓ సందర్భంలో తెలిపారు.
ఇదిలా ఉంటే... నాగార్జున యంగ్ లుక్, ఫిట్ నెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. 35 ఏళ్లుగా ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో తెలుసుకోవాల్సిందే.
చాలా మంది ఫుడ్ కంట్రో లో పెట్టాలని.. రైస్ తగ్గించి, మార్నింగ్ స్ప్రౌట్స్, వెయిట్ లాస్ ఫుడ్ తీసుకోవాలని చెబుతుంటారు. కానీ కింగ్ మాత్రం అలాంటి సలహాలేమీ ఇవ్వడం లేదు. మీకు నచ్చింది తినండి కానీ.. ప్రతిరోజూ వర్కౌట్స్ చేయండంటున్నారు.
కింగ్ మార్నింగ్ 6 నుంచి 7 మధ్య బ్రేక్ ఫాస్ట్ లోకి ఎగ్ వైట్ ను బ్రెడ్ ముక్కలతో కలిపి తీసుకుంటారు. ఆ తర్వాత రెండు గంటలకు సెకండ్ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అప్పుడు దోస లేదా ఇడ్లీ వాటితో పాటు ఫ్రూట్స్ తింటారు.
ఇక మధ్యాహ్న భోజనంలోకి రైస్ తో పాటు రోటీ, నాలుగు రకాల కూరగాయల కూరలను తింటారు. సాయంత్రం స్నాక్స్ లోకి కేవలం తాజా పండ్లను మాత్రమే తింటారు. ఇక రాత్రి 7 గంటలకు డిన్నర్ ఉంటుంది.
రాత్రి భోజనంలో మాత్రం మాంసం తింటారు. కొద్ది మోతాదులోనే.. గ్రిల్డ్ చికెన్, ఫిష్, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకుంటారు. ఇలా ఫుడ్ డైట్ ను క్రమం తప్పకుండా పాటిస్తారు. ఇక రాత్రి పడుకునే ముందుకు మాత్రం ఏదైనా ఒక స్వీట్ తప్పకుండా ఉండాల్సిందేనంట. అలాగే కింగ్ హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడుతుంటారు. వీటితో పాటు ఉదయం మాత్రం రెగ్యులర్ వర్కౌట్స్ తో పాటు మరిన్ని ఎక్సర్ సైజ్ లు చేస్తారు.