'ఖుషి' రీ రిలీజ్ చూసిన అకిరా.. ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ సందడి, పవన్ కొడుకు స్టైలిష్ లుక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పదింతలు పెంచుతూ అభిమానులు గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ఖుషి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పదింతలు పెంచుతూ అభిమానులు గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ఖుషి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఖుషి వేసిన పునాదితో ఆ తర్వాత పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ లేకపోయినా క్రేజ్ చెక్కు చెదరలేదు.
గతంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు కోసం ఖుషి చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్స్ లో ఖుషి రీరిలీజ్ హంగామా కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఖుషి చిత్రం.. ఆల్ టైం రీరిలీజ్ రికార్డ్ ఉన్న జల్సా చిత్రాన్ని అధికమించింది. అయితే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా పవన్ తనయుడు అకిరా నందన్ రంగంలోకి దిగాడు. దేవి థియేటర్ లో అకిరా నందన్ ఫ్యాన్స్ తో కలసి ఖుషి చిత్రాన్ని వీక్షించాడు.
పవన్ పెద్ద కొడుకు స్టైలిష్ లుక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. అకిరా ఫ్యాన్స్ తో కలసి ఖుషి చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ టీ షర్ట్ ధరించిన అకిరా.. మాస్క్ పెట్టుకుని థియేటర్ కి వెళ్ళాడు.
ఖుషి హంగామా డిసెంబర్ 31 రాత్రిని రెట్టింపు కానుంది. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఖుషి చిత్రంతో సంబరాలు చేయనున్నారు. ఖుషి చిత్రాన్ని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాణంలోనే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు.
ఏది ఏమైనా నెమ్మదిగా అకిరా నందన్ ఫ్యాన్స్ తో టచ్ లోకి వస్తున్నాడు. అకిరా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. మరి మెగా వారసుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే ఆలస్యం. అయితే అకిరా ఇంకా చిన్న వయసే కాబట్టి దానికి ఇంకా టైం ఉందని అంటున్నారు.