MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: అఖిల్ కోసం ఇంటిని తాకట్టు పెట్టిన రామచంద్ర.. జాబ్ వచ్చింది అన్న సంతోషంలో అఖిల్?

Janaki Kalaganaledu: అఖిల్ కోసం ఇంటిని తాకట్టు పెట్టిన రామచంద్ర.. జాబ్ వచ్చింది అన్న సంతోషంలో అఖిల్?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 23 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 23 2022, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ రామచంద్ర ఇంటికి వచ్చి 20 లక్షలు ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ చరణ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామచంద్ర. ఇప్పుడు ఏం చేయాలి సమయానికి జానకి గారు కూడా నాకు సలహా ఇవ్వడానికి లేదు అనుకుంటుండగా ఇంతలోనే జానకి ఫోన్ చేస్తుంది. అప్పుడు రామచంద్ర జానకి గారు మీకు 100 ఏళ్ళు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను అనగా నేను మధ్యాహ్నం నుంచి మీ గురించి అనుకుంటున్నాను అని అంటుంది జానకి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీనికి జానకి గారు అనడంతో దేనికి అంటారేంటండి కార్యక్రమం ఉంది నాతో పాటు బయలుదేరి వస్తాను మీరు వెళ్ళండి అన్నారు అనడంతో రామచంద్ర ఆ విషయం మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాడు. వస్తాను అన్నాను కానీ వేరే పనిలో ఉండి రాలేక మర్చిపోయాను అని అంటాడు రామచంద్ర. ఏంటి రామచంద్ర గారు ఇది మీకోసం ఎంత వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంటుంది. అప్పుడు రామచంద్రా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనడంతో మీరు ఇప్పుడు ఏం చెప్పినా వినను రామ గారు మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు.
 

37

 నేను ఇక్కడే ఉంటాను మీరు వస్తారు కదా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి జానకి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు రామచంద్ర ఏం చేయాలో తెలియక ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంటాడు. ఇంటి డాక్యుమెంట్ తీసుకొని ఒక అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రామచంద్ర ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని తనకు అవసరమైన డబ్బును ఇవ్వమని అడగడంతో అతను షాక్ అవుతాడు. అప్పుడు సరే అని అన్నంతో రామచంద్ర పేపర్స్ పై సైన్ చేసి 20 లక్షలు డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు జానకి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్నకు పిల్ల ప్రదక్షణ కార్యక్రమం చేస్తూ ఉంటారు.
 

47

 ఆ తర్వాత రామచంద్ర డబ్బు తీసుకొని బయటకు వచ్చి జానకికి ఫోన్ చేస్తాడు. అప్పుడు జానకి వాళ్ళ వదిన ఊర్మిళ ఫోన్ లిఫ్ట్ చేసి నేను జానకి వాళ్ళ వదిన మాట్లాడుతున్నాను కార్యక్రమం మొదలైంది నువ్వు చెరువు దగ్గరికి వచ్చే అనడంతో నేను కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోతున్నాను అని రామచంద్ర అనడంతో సరే జానకికి ఫోన్ ఇవ్వాలా అని అంటుంది ఊర్మిళ. అప్పుడు రామచంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తర్వాత జానకి వాళ్ళ వదిన ఊర్మిళ నువ్వు అమ్మానాన్న ఆప్తికమని మౌనంగా ఉన్నామని అనుకున్నాను కానీ రామచంద్ర మాటలు విన్న తర్వాత ఏదో ప్రాబ్లం లో ఉన్నారని అర్థమవుతోంది ఏమైంది జానకి అని అడుగుతుంది.

57

అప్పుడు జానకి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మామయ్య గారికి ఆరోగ్యం అసలు బాగుండడం లేదు దానికి తోడు అఖిల్ మంచి చదువు చదువుకుని ఏ ఉద్యోగంలో స్థిరపడలేదు అని మరింత బాధ పెడుతున్నారు. అదే విషయం గురించి రామచంద్ర గారు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాము ఆ విషయం పైన ఇక్కడికి రాలేకపోయి ఉంటారు అని అంటుంది జానకి. అఖిల్ విషయంలో అత్తయ్య గారు మామయ్య గారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది జానకి. అప్పుడు జానకి వాళ్ళ అన్నయ్య మీరు అఖిల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దని ఎక్కువగా ఆలోచించకు జానకి అని అంటారు. తర్వాత రామచంద్ర డబ్బు తీసుకొని తన ఫ్రెండు చరణ్ దగ్గరికి వెళ్తాడు.
 

67

నువ్వు చెప్పిన టైం ఇంకా అయిపోలేదు కదా అనడంతో ఇంకా లేదు అని అంటాడు చరణ్. అప్పుడు రామచంద్ర మా అమ్మకు తెలియకుండా నేను షర్టు కూడా కొనుక్కోను అలాంటిది ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను మా ఇంటి కాగితాలు కుదవపెట్టి డబ్బులు తీసుకొని వచ్చాను అని అంటాడు రామచంద్ర. అప్పుడు చరణ్ నువ్వు బాధపడకు కరెక్ట్ గా మూడు నెలల్లో నీ డబ్బులు నీకు తిరిగి వచ్చేస్తాయి అని అంటాడు. అప్పుడు చరణ్ నీకు ఇబ్బందిగా ఉంటే డబ్బులు తీసుకుని వెళ్ళు నేను వేరే చోట నీ తమ్మునికి జాబ్ ఇప్పిస్తాను అనడంతో లేదు లేరా  సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అంటాడు రామచంద్ర.

77

అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు అఖిల్ ఇంటర్వ్యూ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలో జెస్సి అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ కి వెళ్తున్నావా అఖిల్ అనడంతో అవును అని అంటాడు. ఆ తర్వాత అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో చరణ్ ఫోన్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అనడంతో అఖిల్ సంతోషపడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved