- Home
- Entertainment
- నాగార్జున చిన్న కోడలు పబ్లిక్ గా తొలిసారి అఖిల్ తో ఇలా.. దిష్టి తీయమంటున్న నెటిజన్లు
నాగార్జున చిన్న కోడలు పబ్లిక్ గా తొలిసారి అఖిల్ తో ఇలా.. దిష్టి తీయమంటున్న నెటిజన్లు
అక్కినేని యువ వారసుడు అఖిల్ కి ఏజెంట్ చిత్రంతో పెద్ద షాకే తగిలింది. దీనితో అఖిల్ కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ కొత్త చిత్రం గురించి ఇద్దరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి.

Akhil Akkineni, Zainab Ravdjee
అక్కినేని యువ వారసుడు అఖిల్ కి ఏజెంట్ చిత్రంతో పెద్ద షాకే తగిలింది. దీనితో అఖిల్ కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ కొత్త చిత్రం గురించి ఇద్దరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. ఒక దర్శకుడితో రాయలసీమ నేపథ్యంలో చిత్రం ఆల్మోస్ట్ కంఫర్మ్ అయింది. అఖిల్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడే కానీ ఒక్క హిట్టు కూడా అతడిని వరించలేదు.
Akhil Akkineni
పెళ్లి తర్వాత అయినా అఖిల్ జాతకం మారుతుందేమో చూడాలి. ఆల్రెడీ అఖిల్, జైనాబ్ రావ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఆమె తండ్రి నాగార్జునకు బిజినెస్ లో భాగస్వామి అనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో ఉన్న పరిచయం కారణంగా అఖిల్, జైనాబ్ రియల్ లైఫ్ లో భాగస్వాములు కాబోతున్నారు.
Akhil Akkineni
మార్చిలో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. అయితే తాజాగా అఖిల్, జైనాబ్ తొలిసారి పబ్లిక్ గా కనిపించారు. ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెకేషన్ కి వెళుతున్నారా లేక పెళ్లి షాపింగ్ కి వెళుతున్నారా అనేది ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.
Akhil Akkineni
మార్చిలోనే పెళ్లి జరగనుండడంతో పెళ్లి పనుల కోసమే అఖిల్, జైనాబ్ జంటగా వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలిసారి అఖిల్, జైనాబ్ లని పబ్లిక్ గా జంటగా చూస్తున్న నెటిజన్లు ఇద్దరికీ దిష్టి తీయండి అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు చిన్నోడు, చిన్న కోడలు అని కామెంట్స్ చేస్తున్నారు. చేతిలో చేయి వేసుకుని అఖిల్, జైనాబ్ కనిపించారు.