- Home
- Entertainment
- అఖిల్ తనకంటే 8ఏళ్లు పెద్ద అయిన జైనబ్‌ని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో తెలుసా? తెరవెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
అఖిల్ తనకంటే 8ఏళ్లు పెద్ద అయిన జైనబ్‌ని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో తెలుసా? తెరవెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్‌డ్జీ తో ఆయన పెళ్లి అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, దాని వెనుక ఆసక్తికర స్టోరీ బయటకు వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గ్రాండ్‌గా ముగిసిన అఖిల్, జైనబ్‌ల పెళ్లి వేడుక
అఖిల్ అక్కినేని ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆయన ప్రముఖ వ్యాపార వేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్ రవ్‌డ్జీని జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వీరి రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో సందడి చేశారు. మొత్తంగా పెళ్లి హడావుడి ముగిసింది.
అఖిల్ అక్కినేని, జైనబ్‌ల మధ్య ఏజ్ గ్యాప్ చర్చ
ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అఖిల్ పెళ్లి చేసుకున్న జైనబ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అఖిల్, జైనబ్‌ల మధ్య ఏజ్ గ్యాప్ బాగా చర్చనీయాంశం అవుతుంది. అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్లు పెద్ద అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖిల్ ఏజ్ 31ఏళ్లు, కానీ జైనబ్ ఏజ్ 39 ఏళ్లు అట.
అఖిల్, జైనబ్‌ల లవ్ స్టోరీ
మరి తనకంటే 8ఏళ్లు పెద్ద అయిన జైనబ్‌ని అఖిల్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీని వెనుక ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అదే లవ్. అవును అఖిల్, జైనబ్‌లది కేవలం అరెంజ్ మ్యారేజ్ కాదు, లవ్ కమ్ అరెంజ్ మ్యారేజ్. పెళ్లికి ముందే వీరిద్దరు రెండుమూడేళ్లపాటు ప్రేమించుకున్నారట. ఓ ఫంక్షన్‌లో వీరిద్దరు కలుసుకున్నారని, ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.
అఖిల్, జైనబ్‌ల ప్రేమకి పెద్దలు గ్రీన్ సిగ్నల్
ఆ తర్వాతనే ఇద్దరు ఫ్యామిలీలు కలిశాయని, పెద్దలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇద్దరివీ హై ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీలే, దీంతో పెద్దగా అభ్యంతరం చెప్పలేదని, ఇటు నాగార్జున, అటు జుల్ఫీ ఫ్యామిలీ ఓకే చెప్పిందని సమాచారం.
అలా తనకంటే ఏజ్‌లో పెద్ద అయినా జైనబ్‌ని అఖిల్ పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదు. ఇలా తమకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వారిని భార్యలుగా తెచ్చుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు, ఆ జాబితాలో ఇప్పుడు అఖిల్ కూడా చేరిపోయాడని చెప్పొచ్చు.
జైనబ్ చేసే పని ఇదే
జైనబ్.. ఆర్టిస్ట్ (పెయింటింగ్). ఆమె స్కిన్ కేర్‌కి సంబంధించిన టిప్స్ ఇస్తుంది. అందుకోసం ఒక బ్లాగ్‌ని కూడా నిర్వహిస్తుంది. అలాగే బేస్పోక్ పర్‌ఫ్యూమర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. జైనబ్ వేసిన చాలా పెయింట్స్ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడు పోయాయట. హైదరాబాద్‌లోనూ ఎగ్జిబిషన్ నిర్వహించారట. ఇప్పుడు ఏకంగా ఒక ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నట్టు తెలుస్తోంది. అఖిల్.. హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `లెనిన్` అనే చిత్రంలో నటిస్తున్నారు.