- Home
- Entertainment
- TV
- రామ్ చరణ్ అర్జునుడు, కర్ణుడిగా ప్రభాస్, రాజమౌళి మహ భారతంలో కృష్ణుడు ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో
రామ్ చరణ్ అర్జునుడు, కర్ణుడిగా ప్రభాస్, రాజమౌళి మహ భారతంలో కృష్ణుడు ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో
Rajamouli Mahabharat : రాజమౌళి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కర్ణుడిగా ప్రభాస్, అర్జునుడిగా రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది. కృష్ణుడిగా ఎవరు బాగుంటారు. దీనికి సబంధించిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, ప్రభాస్ అభిమానులను దిల్ ఖుష్ చేస్తుంది ఓ వీడియో. ఆ వీడియోలో ప్రభాస్ కర్ణుడిగా తన వీరత్వం చూపిస్తూ.. యుద్దంలో గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే.. అర్జునుడిగా రామ్ చరణ్ బాణాలు సంధిస్తూ.. రెచ్చిపోయాడు. మహాభారత యుద్దం ఆధారంగా తయారు చేసిన ఈ ఏఐ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. ఈ వీడియోను ఓ అభిమాని తయారు చేసి.. ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే రాజమౌళి తెరెక్కించబోయే మహాభారతం అని అభిమానులు అంటున్నారు . కర్ణుడు, అర్జునుడు ఒకే.. మరి కృష్ణుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్...
ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది బడా దర్శకులు మహా భారత గాధను సినిమాగా తెరకెక్కించారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. భారతీయ పురాణాల్లో మహత్తర గాధగా నిలిచిన మహాభారతం ఎన్నిసార్లు విన్నా, చదివినా, చూసినా మళ్లీ మళ్లీ చూడదలనిపిస్తుంది. అయితే దర్శకులు ఆ పాత్రలను చూపించే కోణాన్ని బట్టి.. సినిమాపై ఆసక్తి కలుగుతుంది. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్ రూపంలో మహాభారతం రూపొందింది. కానీ దేశ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే ‘మహాభారతం’ గురించి ఎదురుచూస్తున్నారు. జక్కన్న ఈసినిమాను ఎలా చెక్కబోతున్నారు..? ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు? ఎవరెవరు నటిస్తారు అని ఎదరుచూస్తున్నారు.
జక్కన్న మహాభారతం ఎన్ని భాగాలు?
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా బిజీలో ఉన్నారు. ఈసినిమా పూర్తి అయిన తరువాత ఆయన మహాభారతం సిరీస్‌పై పని మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా జక్కన్న భారతం స్టార్ట్ చేస్తారా..? లేక ఇంకా ఆయన చేయాలి అనుకున్న ఇతర సినిమాలు వేరే ఉన్నాయా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే భారతం స్టార్ట్ అయితే రాజమౌళి మరే సినిమా చేయడానికి వీలు ఉండదు. భారతాన్ని ఎన్ని సిరీస్ లుగా జక్కన్న చెక్కబోతున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు. దాంతో తన కెరీర్ లో ఫైనల్ ప్రాజెక్ట్ గా రాజమౌళి ఈ సిరీస్ ను తెరకెక్కించవచ్చని అంటున్నారు. ఈసిరీస్ లు కంప్లీట్ చేసిన తరువాత రాజమౌళి సినిమాల నుండి తప్పుకుంటారని సమాచారం.
మహాభారతంలో స్టార్స్ నటించబోయే పాత్రలు?
ఇక ఈ అద్భుత కళాఖండాన్ని రాజమౌళి.. కొత్తవాళ్లతో రూపోందిస్తారా లేక.. ఇండియన్ సినిమాకు చెందిన పెద్ద పెద్ద స్టార్స్ ను ఈసినిమా కోసం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం స్టార్ హీరోలనే ఆ పాత్రల కోసం తీసుకుంటారని ఊహిస్తున్నారు. అంతే కాదు అందుక తగ్గట్టుగా AI వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలోని ఒక సన్నివేశాన్ని తీసుకుని ప్రముఖ హీరోలతో వీడియో రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అర్జునుడిగా, ప్రభాస్ కర్ణుడిగా కనిపించేలా తీర్చిదిద్దిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఏ కోణంలో చూసినా ఓరిజినల్ లా కనిపించేలా అద్భుతంగా చేశారు.
కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ?
ఇక అర్జునుడిగా చరణ్, కర్ణుడిగా ప్రభాస్ ఒకే.. మరి కృష్ణుడిగా ఎవరు అన్న ప్రశ్నకు మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా బాగుంటాడని అంటున్నారు. ఇతర పాత్రల విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌ను భీముడిగా, నానిని నకులుడిగా, విజయ్ దేవరకొండను సహదేవుడిగా, ధర్మరాజు పాత్రకు పవన్ కళ్యాణ్, భీష్ముడికి రజినీకాంత్, ద్రోణాచార్యుడికి అమితాబ్ బచ్చన్, దుర్యోధనుడికి రానా, ద్రౌపది పాత్రకు దీపికా పదుకొనే పేర్లు సోషల్ మీడియాలో ఊహిస్తూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ పేర్లను ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటాడో చూడాలి.

