మహేష్ బాబు హీరోయిన్ మనసుపడ్డ 7 హీరోలు, ప్రియాంక చోప్రా మాజీ లవర్స్ ఎవరో తెలుసా?
Priyanka Chopra Dating History : ప్రియాంక చోప్రా పెళ్లై ఏడేళ్లు అవుతోంది. నిక్‌ను పెళ్లి చేసుకోకముందు ఆమె చాలా మంది సెలబ్రిటీలతో ప్రేమలో పడింది. గ్లోబల్ బ్యూటీ ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరోలో ఎవరో తెలుసా?

అసీమ్ మర్చెంట్
ప్రియాంక చోప్రా డేటింగ్ లిస్ట్ లో మొదటి పేరు అసీమ్ మర్చంట్. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే ప్రియాంక అసీమ్‌తో ప్రేమలో పడింది. కానీ, వాళ్ల బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొంత కాలానికే వారు బ్రేకప్ చెప్పుకున్నారు.
హర్మన్ బవేజా
మోడలింగ్ తరువాత ప్రియాంక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు హర్మన్ బవేజాతో ఆమె ప్రేమలో పడింది. వీరి బంధం కూడా కొంత కాలం నడిచింది. ఆతరువాత ప్రియాంక సినిమాలతో బిజీ అయిపోయింది.
షాహిద్ కపూర్
హర్మన్ బవేజాతో బ్రేకప్ తర్వాత ప్రియాంక, షాహిద్ కపూర్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట.. ఆతరువాత బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.
అక్షయ్ కుమార్
ప్రియాంక చోప్రా ప్రేమికుల జాబితాలో అక్షయ్ కుమార్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, అక్షయ్‌కు అప్పటికే పెళ్లైంది. అందుకే వాళ్లిద్దరి ప్రేమ రూమర్ గానే మిగిలిపోయింది.
షారుఖ్ ఖాన్
'డాన్ 2' సినిమా షూటింగ్ టైంలో ప్రియాంక పేరు షారుఖ్ ఖాన్‌తో వినిపించింది. కానీ గౌరీ ఖాన్ వల్ల వాళ్ల మధ్య దూరం పెరిగింది. అయితే ఇది రూమర్ మాత్రమే. నిజంగా వీరు ప్రేమించుకున్నట్టు ఆధారాలు లేవు.
టామ్ హిడిల్‌స్టన్
ప్రియాంక హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తరువాత ..టామ్ హిడిల్‌స్టన్‌తో డేటింగ్ చేసింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. హాలీవుడ్ లో ప్రియాంక తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది.
నిక్ జోనస్
ఆ తర్వాత ప్రియాంక మనసు నిక్ జోనస్‌పై పడింది. 2018లో అతన్ని పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఓ పాపకు కూడా ఆమె జన్మనించ్చింది. ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ వారణాసిలో నటిస్తోంది.

