అజిత్ ఏంటి ఇలా అయిపోయాడు..? ఇంత సన్నగా మారడానికి కారణం ఏంటి..?
స్టార్ హీరో అజిత్ కుమార్ బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అజిత్ ఇలా అవ్వడానికి కారణం ఏంటి..?
అజిత్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు అజిత్ కుమార్. ప్రస్తుతం ఆయన నటించిన రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి విడముయర్చి, మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. విడముయర్చి చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. పూర్తిగా అజర్‌బైజాన్‌లో చిత్రీకరించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.
Also Read: చిరంజీవికి చెల్లెలు.. బాలయ్య హీరోయిన్.. సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఎవరో తెలుసా..?
అజిత్ కార్ రేస్
అజిత్ నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ రెండు సినిమాల్లో త్రిష హీరోయిన్ నటిస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీకి జివి ప్రకాష్ కుమార్, విడముయర్చికి అనిరుద్ సంగీతం అందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే నెలలో అజిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు టీమ్
Also Read: ఒక ఏడాదిలో 35 సినిమాల్లో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు!
అజిత్
విడముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ నటించనున్న చిత్రానికి కంగవా దర్శకుడు శిరుతై శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అయితే ఈమధ్య అజిత్ లో చాలా మర్పు కనిపిస్తోంది. గత నెల వరకు బొద్దుగా ఉన్న అజిత్ ఒక్క నెలలోనే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.
Also Read:33 ఏళ్ళ తరువాత ఆ స్టార్ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా, తలైవా ఫ్యాన్స్ కు పండగే.
అజిత్ కుమార్ స్లిమ్ లుక్ ఫొటోస్
స్లిమ్ లుక్‌లో సూపర్ ఫిట్‌గా ఉన్న ఆయన చెవిలో కమ్మలు ధరించి స్టైలిష్‌గా కనిపించారు. ఇక ఈ న్యూ లుక్ లో ఉన్న అజిత్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అజిత్ జనవరిలో దుబాయ్‌లో జరగనున్న కార్ రేస్‌లో పాల్గొననున్నందున బరువు తగ్గి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా.. అజిత్‌ను స్లిమ్ లుక్‌లో చూసిన అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.
Also Read:సుబ్బరాజు భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా... ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంటుంది..?
Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?