- Home
- Entertainment
- Valimai Review:వలిమై ప్రీమియర్ టాక్... హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్, అజిత్-కార్తికేయ ఫైట్ ఎలాగుందంటే!
Valimai Review:వలిమై ప్రీమియర్ టాక్... హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్, అజిత్-కార్తికేయ ఫైట్ ఎలాగుందంటే!
కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై థియేటర్స్ లో దిగింది. రాత్రి నుండే వలిమై ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. వలిమై ట్రైలర్ కి భారీ స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. మరి అజిత్ ఆ అంచనాలు ఎంత వరకు అందుకున్నారు? వలిమై ప్రీమియర్ షో(Valimai Review) చూసిన ఆడియన్స్ మూవీకి ఎలాంటి రివ్యూ ఇస్తున్నారో చూద్దాం..

వలిమై (Valimai) కథ విషయానికి వస్తే చెన్నై కేంద్రంగా కార్తికేయ సైతాన్ స్లేవ్స్ పేరుతో నేర సామ్రాజ్యం నడుపుతూ ఉంటాడు.డ్రగ్స్, మర్డర్స్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. మోస్ట్ ఇంటెలిజెంట్, డేంజరస్ క్రిమినల్ కార్తికేయను పట్టుకోవడానికి ఏసీపీ అర్జున్ (అజిత్ కుమార్) రంగంలోకి దిగుతాడు. ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య పోరులో విజయం ఎవరిదనేది మిగతా కథ...
వలిమై చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా వలిమై యాక్షన్ సన్నివేశాలు అద్భుతం అంటున్నారు. సినిమాను రేసీగా నడిపే స్క్రీన్ ప్లే అదనపు ఆకర్షణ. హీరో అజిత్ కుమార్ ప్రెజెన్స్ హైలెట్ అంటున్న ఆడియన్స్ కార్తికేయతో ఆయన ఇగో వార్ గొప్ప అనుభూతిని పంచింది అంటున్నారు.
మంచి కథకు రైట్ క్యాస్టింగ్ తోడైందన్న మాట వినిపిస్తుంది. కథలో భాగమైన హీరోయిన్ హుమా ఖురేషి పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. విలన్ గా నెగిటివ్ రోల్ లో కార్తికేయ(Karthikeya) ఇరగదీశాడు అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, బస్సు ఛేజ్ సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చేసినట్లు ట్విట్టర్ పోస్ట్స్ చూస్తే అర్థమవుతుంది.
అయితే ఫస్ట్ హాఫ్ కి బ్లాక్ బస్టర్ రివ్యూ ఇస్తున్న ప్రేక్షకులు సెకండ్ హాఫ్ కి యావరేజ్ రివ్యూ ఇస్తున్నారు. సెకండ్ హాఫ్ లో సినిమా నెమ్మదించిందడంతో పాటు నిడివి ఎక్కువైందన్న మైనస్ పాయింట్ హైలైట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ దర్శకుడు కొంచెం వేగంగా, ఆసక్తికరంగా నడిపి ఉంటే వలిమై రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తుంది.
మరలా క్లైమాక్స్ సన్నివేశాలకు పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి. చివర్లో యూత్ కి మంచి సందేశం ఇచ్చారట. వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న యువతకు మంచి సందేశం ఇచ్చారు. వలిమై మూవీని యాక్షన్, సెంటిమెంట్, సోషల్ మెసేజ్ వంటి అంశాలతో పర్ఫెక్ట్ గా రూపొందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
అజిత్ (Ajith Kumar) ఫ్యాన్స్ మాత్రం ఆద్యంతం వలిమై చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు, బైక్ ఛేజింగ్ లు ఓ రేంజ్ లో అలరిస్తాయి. సాధారణ ప్రేక్షకులను కూడా వలిమై చాలా వరకు అలరిస్తుంది. నిరాశపరిచే చిత్రమైతే కాదు. అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే మరింత గొప్ప అనుభూతిని ఇస్తుంది.
అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ తెరకెక్కించిన చిత్రమే 'వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.