- Home
- Entertainment
- Tegimpu Review: 'తెగింపు' ప్రీమియర్ షో టాక్..అజిత్ మ్యానరిజమ్స్, కొన్ని మాస్ మూమెంట్స్ కేక.. కానీ
Tegimpu Review: 'తెగింపు' ప్రీమియర్ షో టాక్..అజిత్ మ్యానరిజమ్స్, కొన్ని మాస్ మూమెంట్స్ కేక.. కానీ
అజిత్ చిత్రాలు స్టైలిష్ గా ఉంటూ ఫ్యాన్స్ కి మంచి అనుభూతి ఇస్తుంటాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన తెగింపు చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తమిళంలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు నేడు విడుదలవుతున్నాయి. విజయ్ నటించిన 'వారీసు' నేటి నుంచి తమిళ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. తెలుగులో చిత్రం వారసుడుగా 14న రిలీజ్ కానుంది. ఇక అజిత్ నటించిన 'తెగింపు' చిత్రం తెలుగు తమిళ్ రెండు భాషల్లో నేడే రిలీజ్ అవుతోంది..
అజిత్ చిత్రాలు స్టైలిష్ గా ఉంటూ ఫ్యాన్స్ కి మంచి అనుభూతి ఇస్తుంటాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన తెగింపు చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. వినోద్ ఈ చిత్రాన్ని క్రైమ్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్ లు నమోదవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు వినోద్ అక్కడక్కడా కొన్ని మాస్ మూమెంట్స్ పెట్టారు. కానీ ఇంటర్వెల్ పోర్షన్ వరకు సినిమా అంతగా ఆసక్తిని పెంచదు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం యాక్షన్ పరంగా మెప్పిస్తుంది.
ఇక సినిమా నిలబడాలంటే అద్భుతమైన సెకండ్ హాఫ్ అవసరం. కానీ వినోద్ ఫస్ట్ హాఫ్ కంటే కాస్త బెటర్ అనిపించే సెకండ్ హాఫ్ మాత్రమే డెలివరీ చేశారు. వినోద్ ఈ చిత్రం కోసం అద్భుతమైన పాయింట్ ఎంచుకున్నారు. కథలో బ్యాగ్రౌండ్ సెటప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నెరేషన్ ఫ్లాట్ గా ఉండడంతో సినిమా అంతగా పేలలేదు.
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యాన్ మూమెంట్స్, అజిత్ మాస్ మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయి. అజిత్ కి ఈ చిత్రంలో స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడం కూడా మైనస్ గా మారింది. అజిత్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ నడిపించాడు. తెగింపు అద్భుతమైన చిత్రంగా మలిచే అవకాశం, పొటెన్షియల్ ఉన్న కథ. కానీ ఆ అవకాశాన్ని వినోద్ సరిగ్గా వినియోగించుకోలేదు.
ఫ్యాన్స్ వరకు ఒకే కానీ కామన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. క్లైమాక్స్ రొటీన్ గా ఉండడం కూడా ఈ చిత్రానికి మైనస్ గా మారింది. స్క్రీన్ ప్లేలో గందరగోళం కనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కథకి తగ్గట్లుగా అద్భుతంగా ఉంటుంది.
సంక్రాంతి సీజన్ కాబట్టి తమిళంలో అజిత్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తెలుగులో పరిస్థితి ఏంటో చూడాలి. గత ఏడాది అజిత్, వినోద్ కాంబినేషన్ లో వలిమై చిత్రం వచ్చింది. దీనితో ఈ యువ దర్శకుడు మరో అద్భుత అవకాశం మిస్ చేసుకున్నాడు.