MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దటీజ్ అజిత్.. 10 నెలల బిడ్డతో తల్లి ప్రయాణం, నాకూ ఇద్దరు పిల్లలు అంటూ ఆమె లగేజ్ మోసిన తలా

దటీజ్ అజిత్.. 10 నెలల బిడ్డతో తల్లి ప్రయాణం, నాకూ ఇద్దరు పిల్లలు అంటూ ఆమె లగేజ్ మోసిన తలా

అజిత్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలసిపోతుంటారు. తాజాగా అజిత్ చేసిన పని అభిమానుల మనసు దోచుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 15 2023, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తలా అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ పేరు విన్నా, ఆయన నటించిన సినిమాలు విడుదలైనా తమిళనాట ఎలాంటి సందడి ఉంటుందో తెలిసిందే. అజిత్ మాస్ చిత్రాలు, స్టైలిష్ థ్రిల్లర్ చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. అజిత్ చివరగా 'తెగింపు' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

26

ఇదిలా ఉండగా అజిత్ ఇటీవల తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు అజిత్ ని కలసి పరామర్శించారు కూడా. ఇక అజిత్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలసిపోతుంటారు. తాజాగా అజిత్ చేసిన పని అభిమానుల మనసు దోచుకుంటోంది. 

36

తన భార్యకి అజిత్ చేసిన సాయం గురించి ఆమె భర్త కార్తీక్ వివరించారు. 'మా 10 నెలల బిడ్డతో గ్లాస్గో నుంచి చెన్నైకి నా భార్య  ఒంటరిగా ప్రయాణిస్తోంది. లండన్ విమానాశ్రయంలో అజిత్ కనిపించారు. వేంటనే నా భార్య సర్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అడిగింది. 

46

దీనితో అజిత్ ఆమెతో ఫోటో దిగడం మాత్రమే కాదు.. నా భార్య లగేజ్ ని విమానం వరకు మోశారు. నేను చూసుకుంటాను సర్ అని చెప్పగా.. పర్వాలేదు.. నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఇబ్బంది ఏంటో నాకు తెలుసు అని అజిత్ స్వయంగా ఆమె లగేజ్ మోశారు. 

56

అనంతరం షటిల్ బస్సులో కూడా ఆమె లగేజ్ తో ఇబ్బంది పడుతుంటే అజిత్ సాయం చేశారు. ఆయన వ్యక్తిత్వం నన్ను కదిలించింది అని అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

66

దీనితో అజిత్ ని చూస్తూ ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అజిత్ ని ఈ స్థాయికి చేర్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా అజిత్ ప్రస్తుతం తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Recommended image2
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved