MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే ఫైట్‌ చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే ఫైట్‌ చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా బిజీగా ఉంది. మరోవైపు తల్లిగా తీరిక లేకుండా ఉంది. ఈ క్రమంలో ఆమె నటించిన `సతీ లీలావతి` మూవీ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : May 06 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సతీ లీలావతి మూవీతో రాబోతున్న లావణ్య త్రిపాఠి
Image Credit : Asianet News

సతీ లీలావతి మూవీతో రాబోతున్న లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలిగా ఉన్నారు. ఆమె వరుణ్‌ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరికి కుమారుడు కూడా జన్మించారు. మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తున్న లావణ్య ఇప్పుడు తన సినిమాతో సందడి చేయబోతుంది. `సతీ లీలావతి` అనే చిత్రంలో నటించారు. ఆమెకి జోడీగా దేవ్‌ మోహన్‌ నటించగా, తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన షాకింగ్‌ విషయాన్ని పంచుకుంది లావణ్య. ప్రెగ్నెంట్‌తోనే తాను ఫైట్స్ చేసినట్టు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో లావణ్య ముచ్చటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రెగ్నెంట్‌లోనే యాక్షన్‌ సీన్లు చేసిన లావణ్య
Image Credit : Asianet News

ప్రెగ్నెంట్‌లోనే యాక్షన్‌ సీన్లు చేసిన లావణ్య

`సతీ లీలావతి` మూవీ లవ్‌, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో భార్యాభర్తల గొడవలు ఫోకస్‌ చేశారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ కామెడీ ప్రధానంగా సాగుతూ ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. ఇందులో యాక్షన్‌ సీన్లు చేయడంపై లావణ్య త్రిపాఠి స్పందించింది. అవి చేయడం చాలా టఫ్‌ జాబ్‌ అని వెల్లడించింది. ముందు తాను ప్రెగ్నెంట్‌ అని తెలియదని, కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినా  పట్టించుకోకుండా  ప్రెగ్నెంట్‌తోనే తాను యాక్షన్‌ సీన్లు చేసిందట. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించిందట. బాబులోని ఎనర్జీ తనకు వచ్చిందా అన్నట్టుగా చేసిందట.  యాక్షన్‌ సీన్లు చేసి ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ విషయాన్ని తాను ఫ్యామిలీలో ఎవరికీ చెప్పలేదట. కేవలం వరుణ్‌ తేజ్‌కి మాత్రమే తెలుసు అట. వరుణ్‌ బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేశారని తెలిపింది.

Related Articles

Related image1
Jayalalitha-Trisha: జయలలితకి, త్రిషకి మధ్య ఉన్న పోలికలివే, వామ్మో అన్నీ సేమ్‌.. సీఎం అవ్వడం పక్కా?
Related image2
Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం
35
ప్రెగ్నెంట్‌ అని మామయ్యకి తెలియదు
Image Credit : Asianet News

ప్రెగ్నెంట్‌ అని మామయ్యకి తెలియదు

అయితే సినిమా షూటింగ్‌ సమయంలో తాను ప్రెగ్నెంట్‌ అనే విషయం ఇంట్లో మామయ్య, అత్తమ్మకి తెలియదని వెల్లడించింది. దీంతో వారి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ తాను ప్రెగ్నెంట్‌ అని తెలిసినప్పుడు వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారని వెల్లడించింది. తమ ఫ్యామిలీ అన్ని విషయాల్లో చాలా సపోర్టివ్‌ అని, బాగా చూసుకుంటారని వెల్లడించింది. సినిమాల్లో మాదిరిగా తమ ఇంట్లోగానీ, వరుణ్‌తేజ్‌గానీ గొడవలు లేవని, అంతా సాఫీగానే సాగుతుందని, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నట్టు చెప్పింది లావణ్య. అదే సమయంలో మెగా ఫ్యామిలీలు తరచూ కలుస్తుంటామని, అన్ని విషయాలను పంచుకుంటారని, ఒకరికొకరు సపోర్ట్ చేయడంలో అందరు ముందుంటారని వెల్లడించింది లావణ్య త్రిపాఠి.

45
కామెడీ ప్రధానంగా సతీ లీలావతి మూవీ
Image Credit : Asianet News

కామెడీ ప్రధానంగా సతీ లీలావతి మూవీ

సతీ లీలావతి మూవీ కమల్‌ హాసన్‌ చిత్రం తరహాలోనే కామెడీ ప్రధానంగా ఉంటుందని, ఆ స్థాయిలో ఉంటుందని చెప్పలేం గానీ, డిజాప్పాయింట్‌ చేయదు. నవ్విస్తుంది. ఆలోచింప చేస్తుంది. ట్రైలర్‌లో చూపించింది తక్కువే, దాంట్లో చూపించనిది ఇంకా చాలా ఉంది. క్లైమాక్స్ హృదయాన్ని హత్తుకుంటుంది. సినిమా   ఫన్‌ ప్రధానంగా సాగుతుంది. భార్యాభర్తల గొడవలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. సినిమా కేక్‌ వాక్‌లా సాగింది. ట్రైలర్‌ని రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దాని వల్ల మూవీ బాగా ప్రమోట్‌ అయ్యిందని చెప్పింది లావణ్య. ఆయన సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారని వెల్లడించింది.

55
వరుణ్‌తేజ్‌కి గాయం అప్‌ డేట్‌
Image Credit : Asianet News

వరుణ్‌తేజ్‌కి గాయం అప్‌ డేట్‌

వరుణ్‌ తేజ్‌ గాయంపై స్పందిస్తూ, కీలుకు గాయమైందని, సర్జరీ జరిగిందని, ఇప్పుడు బెడ్‌ రెస్ట్ లో ఉన్నారని వెల్లడించింది లావణ్య. దాదాపు రెండు నెలల వరకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా కలుసుకున్నామని, అందరు చాలా కేర్‌ తీసుకున్నారని చెప్పారు. ఇక  నెక్ట్స్ సినిమాలకు సంబంధించి స్పందిస్తూ, ఇంకా తాను ఏదీ ఓకే చేయలేదని, కొంత  గ్యాప్‌ తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. మంచి కథాబలం ఉన్న సినిమాలు వస్తే భవిష్యత్‌లో చేస్తానని, అదే సమయంలో వరుణ్‌ తేజ్‌తో కూడా మంచి కథ వస్తే చేస్తానని వెల్లడించింది లావణ్య త్రిపాఠి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Jayalalitha-Trisha: జయలలితకి, త్రిషకి మధ్య ఉన్న పోలికలివే, వామ్మో అన్నీ సేమ్‌.. సీఎం అవ్వడం పక్కా?
Recommended image2
Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved