నన్ను అలా పిలవద్దు అంటూ అజిత్ రిక్వెస్ట్
నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బందిపెట్టకుండా హార్డ్ వర్క్‌తో జీవితంలో ముందుకుసాగండి. కుటుంబాన్ని ప్రేమించండి
actor Ajiths
తమిళ,తెలుగులలో అజిత్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆయనకు ప్రాణాలిచ్చే అభిమానులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అజిత్ ని రకరకాలుగా పిలుచుకుంటూంటారు. అయితే వాటిలో కొన్ని తనని ఇబ్బంది పడుతున్నాయని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో అజిత్ (Ajith Kumar) తన అభిమానుల కోసం ఒక లేఖ విడుదల చేశారు. ఇకపై తనని అజిత్ అనే పిలవమని రిక్వెస్ట్ చేశారు. కొంతమంది తనని దేవుడని పిలుస్తున్నారని అది తనని ఎంతో ఇబ్బంది పెడుతుందని చెప్పారు.
Ajiths film
‘‘పబ్లిక్ ఈవెంట్స్, మీటింగ్స్, లేదా ఎక్కడైనా నేను కనిపించినప్పుడు కడవులే అజిత్ అంటూ పలువురు స్లోగన్స్ చేస్తున్నారు. ఆ స్లోగన్స్ నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు.
ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బందిపెట్టకుండా హార్డ్ వర్క్‌తో జీవితంలో ముందుకుసాగండి. కుటుంబాన్ని ప్రేమించండి’’ అని అజిత్ పేర్కొన్నారు. అజిత్ ఈవిధంగా రిక్వెస్ట్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన స్టార్ ట్యాగ్స్ వద్దని విజ్ఞప్తి చేశారు. అజిత్, లేదా ఏకే అనే తనని పిలవమన్నారు.
ajith kumar
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అజిత్ ‘విదా ముయార్చి’ కోసం వర్క్ చేస్తున్నారు. అజిత్ 62వ సినిమాగా ఇది సిద్ధమవుతోంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు.
గతంలో విదాముయర్చి యాక్షన్ సీన్ కోసం స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అజిత్ నడిపిన కారు ఏకంగా గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Ajith Kumar
మరోవైపు, ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఇది విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ajith kumar
కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ ప్రకారం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.95 కోట్లకి అమ్ముడయ్యాయని సమాచారం. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యాక్షన్ డ్రామా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్‌ను కూడా షాకయ్యేలా చేస్తుంది. ఎందుకంటే అజిత్ సినిమా ఓటీటీ రైట్స్‌కి ఈ రేంజ్‌లో రావడం ఇదే తొలిసారి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.